Friday, November 22, 2024

Breaking: కాంగ్రెస్​లోకి ప్రశాంత్​కిషోర్​? సలహాదారుగా కాకుండా లీడర్​గా చాన్స్​

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేరాల్సిందిగా కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరిగిన కాంగ్రెస్ అగ్రనేతల సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలపై ప్రశాంత్ వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ టాక్స్​ జరిగినట్టు తెలుస్తోంది.

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరవచ్చు. ఆయనను సలహాదారుగా ఉపయోగించరు.. బదులుగా పార్టీలో చేరి నాయకుడిగా పని చేయమని అడిగారు. అతను ఒక వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అవసరమైన రోడ్‌మ్యాప్, సంస్థాగత మార్పుల గురించి సూచించారు అని కాంగ్రెస్​ సీనియర్​ నేత కేసీ వేణుగోపాల్​ అన్నారు.

2024 ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ ప్రెజెంటేషన్ ఇచ్చారని దానిని పార్టీ నేతలు పరిశీలించనున్నట్టు తెలిపారు వేణుగోపాల్​. ఈ బృందానికి ఎవరు నాయకత్వం వహించాలనే దానిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. 370 లోక్‌సభ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలని, మిగిలిన స్థానాల్లో పొత్తులు పెట్టుకోవాలని ప్రశాంత్‌ చెప్పినట్లు ఆ పార్టీ ఉన్నత వర్గాల సమాచారం. ప్రెజెంటేషన్‌పై పార్టీ లీడర్ల బృందం చర్చిస్తుందని రాహుల్ గాంధీ కూడా సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై కూడా ప్రశాంత్ కిషోర్​తో చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement