ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎన్సీపీ చీఫ్ శరత్ పవార్ ను కలిశారు. ఆ తర్వాత ముంబైలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ను ప్రశాంత్ కిశోర్ కలిశారు. అయితే ప్రశాంత్ కిశోర్, షారుక్ సమావేశం ఇపుడు బీటౌన్ లో చర్చకు దారి తీసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమతాబెనర్జీ, ఎంకే స్టాలిన్ అధికారంలోకి రావడానికి వ్యూహాలు రచింది సక్సెస్ అయ్యారు ప్రశాంత్ కిశోర్. అయితే మమతాబెనర్జీ, ఎంకే స్టాలిన్ గెలుపొందిన తర్వాత రాజకీయ వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
శరత్ పవార్ తో నాలుగు గంటల పాటు సమావేశమనంతరం షారుక్ నివాసం లో డిన్నర్ కు హాజరయ్యారు. అయితే ఈ భేటీతో షారుక్ ఖాన్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ ప్రశాంత్ కిశోర్ బయోపిక్ కు సన్నాహాలు చేస్తుందంటూ వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సిబ్బంది దీన్ని కొట్టిపారేశారు. ఇంతకీ చివరికి తెలిసిన అసలు విషమేంటంటే షారుక్, పీకే మంచి స్నేహితులని, అందుకే షారుక్ తో డిన్నర్ చేశారు పీకే.