ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్తగా ఏ పార్టీకి అయితే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తాడో ఆ రాష్ట్రంలో ఆ రాజకీయ పార్టీకి విజయం తిరుగులేకుండా పోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో తనని వెతుక్కుంటూ వచ్చిన పార్టీలకు విజయం అందించారు. తాజాగా పశ్చిమ బెంగాల్ తమిళనాడులో ఆయా పార్టీ లకు విజయం అందించి పెట్టారు. ఇప్పటి వరకు కింగ్ మేకర్ తనకు అపజయమే లేకుండా దూసుకెళ్లాడు పీకే. దేశం నలుమూలలా ఓటరు ఎక్కడ నొక్కితే పడతాడో.. ఎక్కడ ఓటరు ఏ నాయకుడికి జై కొడతాడో పసిగట్టగల నేర్పరి అయిన పీకే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తన సత్తాను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను గెలిపించిన పీకే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార టీఆర్ ఎస్ పార్టీ తో ప్రశాంత్ కిశోర్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా ప్రశాంత్ కిషోర్ టీం మెంబర్ అయిన సుభాష్ హైదరాబాద్ కు చేరుకున్నారని…ఎంపీ కేశవరావు తో భేటి అయినట్లు కూడా తెలుస్తోంది. మరో రెండు రోజులలో కేటీఆర్ తో కూడా సుభాష్ భేటి కానున్నట్లు సమాచారం.
బెంగాళ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా ఉండనని సంచలన ప్రకటర చేశాడు పీకే. మరీ ఇప్పుడు పట్టు పని పదిరోజులు గడవకముందే ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నాడనే వార్త చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో వై ఎస్ షర్మిళ పార్టీతో కలిసిపిచేస్తారని ముందు నుంచి రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న మాట. ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ఆఫీస్ కూడా లోటస్ పాండ్ ముందే ఉంటుంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి కసరత్తు చేస్తున్న వైఎస్ షర్మిలకు ఆయనే వ్యూహకర్తగా ఉంటారని.. కొంత కాలం విజయవాడలో పార్టీకి సంబంధించి చర్చలు కూడా జరిగినట్టు ప్రచారం జరిగింది. అయితే.. ఈ మద్యే పీకే ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకొంటున్నట్టు ప్రకటించడం ఇప్పుడు టీఆర్ ఎస్ పార్టీతో కలిసి పనిచేయాబోతున్నాడన్న విషయం బయటకు రావడంతో..వైఎస్ షర్మిల సందిగ్ధంలో పడట్లు తెలుస్తోంది. మొత్తానికి దేశంలోని పలు రాష్ట్రాలో కింగ్ మేకర్ గా ఉన్న ఈ అపర చాణుక్యుడు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే నమోదవుతుందన్న చర్చ జరుగుతోంది.