Sunday, November 17, 2024

‘ప్ర‌కాశ్ రాజ్’ బ‌ర్త్ డే – ఆయ‌న గురించి ప‌లు విష‌యాలు

న‌టుడే కాదు.. ద‌ర్శ‌కుడు, నిర్మాత‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నాడు ప్ర‌కాశ్ రాజ్. రంగస్థల నటుడిగా ప్రారంభమైన ఆయ‌న జీవితం.. ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించిన విలక్షణ నటుడు. ఇప్పటి వ‌ర‌కు నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. నేడు ఆయ‌న పుట్టిన‌రోజు..ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్.. న‌టుడిగా ఆయనకు తొలుత గుర్తింపు తెచ్చిన చిత్రం కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యుయెట్. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. కాంచీవరం చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. ఐదు సార్లు ఫిల్మ్‌ఫేర్ పురస్కారం, ఆరు సార్లు నంది పురస్కారం, తమిళ నాడు రాష్ట్ర పురస్కారాలు, విజయ అవార్డు మూడు సార్లు అందుకున్నాడు.ఆయన 2021లో జరిగే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన మధ్య తరగతి కుటుంబంలో 1965, మార్చి 26 న జన్మించాడు. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరు మహా నగరానికి వచ్చింది. తండ్రిది మంగుళూరు. ఊళ్ళో ఉండి వ్యవసాయం చెయ్యడం ఇష్టం లేక తన యవ్వనంలో బెంగుళూరుకు పారిపోయి వచ్చాడు. ఒకసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి ప్రకాష్ రాజ్ తోసహా ముగ్గురు పిల్లలు.

కాగా ప్రకాష్ రాజ్ లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమె డిస్కో శాంతి కి సోదరి. తరువాత ఆమెకు విడాకులిచ్చాడు. వారికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతము బాలీవుడ్ కు చెందిన నాట్యకారిణి పోనీ వర్మ ను ఆగస్టు 2010 లో రెండవ వివాహం చేసుకున్నాడు..కాగా ఆయ‌న న‌టించిన ఎన్నో చిత్రాలు హిట్ గా నిలిచాయి..నువ్వు నాకు న‌చ్చావ్. రాజా ది గ్రేట్, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, శ‌త‌మానం భ‌వ‌తి ఇలా ఎన్నో చిత్రాల్లో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ ద‌గ్గ‌ర నుంచి తండ్రి, తాత ఇలా ప‌లు పాత్ర‌ల‌కి ప్రాణం పోశారు.

ఇక ప్ర‌కాశ్ రాజ్ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఉద్దవ్ థాక్రేను కేసీఆర్ కలిసిన సందర్బంలో ప్రకాష్ రాజ్ అక్కడే ఉండటంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఎంతగా చర్చ జరిగింది.అయితే ఇక ఆ తరువాత కేసీఆర్ తో తరచూ కనిపిస్తుండటంతో ఇక టీఆర్ఎస్ లో ప్రకాష్ రాజ్ చేరబోతున్నా రంటూ ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగు తోంది.అయితే ఈ ప్రచారాన్ని ఇటు టీఆర్ఎస్ పార్టీ ఖండించిన పరిస్థితి కాని, ఇటు ప్రకాష్ రాజ్ కూడా స్పందించిన పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ప్రకాశ్ రాజ్ గజ్వేల్ నుండి పోటీ చేసే అవకాశం ఉందనే ఒక ప్రచారం సాగుతోంది. మరి ప్రకాష్ రాజ్ రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఏ మేరకు కీలక పాత్ర పోషిస్తాడనేది ప్రస్తుతం అసక్తిగా మారింది. మ‌రి ఆయ‌న మ‌రిన్ని చిత్రాల్లో న‌టించాల‌ని ప్ర‌క‌శ్ రాజ్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతోంది ఆంధ్ర‌ప్ర‌భ‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement