Saturday, September 14, 2024

అద్భుతంగా యాదాద్రి పుణ్య‌క్షేత్రం నిర్మాణం : గ‌ద్ద‌ర్

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించారు ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ యాదాద్రి పుణ్య‌క్షేత్రాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నార‌ని గ‌ద్ద‌ర్ తెలిపారు. యాదాద్రీశుడికి పూజలు చేశారు. ఆలయ నిర్మాణ విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారని ఆయన ప్రశంసించారు. యాదాద్రి మ‌రింత సుంద‌రంగా త‌యారుకానుంద‌న్నారు.యాదాద్రికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతోపాటు ఆహ్లాదాన్ని పంచే విధంగా చర్యలు చేపట్టింది. యాదాద్రిలోని ప్రధాన గుట్టతోపాటు ప్రెసిడెన్షియల్‌ సూట్లు, టెంపుల్‌ సిటీ చుట్టూ ఉన్న గుట్టలకు సహజత్వం ఉట్టిపడేలా ‘గ్రీన్‌ టెర్రామెష్‌’ విధానంలో కృత్రిమ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ఈ పద్ధతిలో మొదట మెష్‌ను గ్రిల్స్‌తో ఏర్పాటుచేసి ముందుభాగంలో మీటరు మేర ఎర్రమట్టిలో సేంద్రియ ఎరువులు, గడ్డి విత్తనాలు చల్లుతారు. ఆ విత్తనాలు మొలకెత్తి, మొక్కలుగా ఎదిగి ఏడాదంతా పచ్చదనాన్ని పంచుతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement