ఓ వ్యక్తి చెక్కలతో ట్రెడ్ మిల్ తయారు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు మంత్రి కేటీఆర్. ఆ ట్రెడ్ మిల్ అచ్చంగా యాంత్రిక ట్రెడ్ మిల్ లానే పనిచేస్తుండడం పట్ల కేటీఆర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పంచుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వడ్రంగి కళాకారుడు కడిపు శ్రీనివాస్ ఎంతో వైవిధ్యంగా ఆలోచించి చెక్కలతో ట్రెడ్ మిల్ రూపొందించాడని, అందరినీ అబ్బురపరుస్తున్నాడని కొనియాడారు. శ్రీనివాస్ నైపుణ్యానికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. వైవిధ్యంగా ఏదైనా చేయాలన్న తలంపు ఉంటే చాలు గుర్తింపు దానంతట అదే వస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..