Friday, November 22, 2024

Exclusive | జాబిలిపై ప్రగ్యాన్​ ప‌ని షురూ.. వేడి ఎంతుందో తెలుసుకున్న రోవ‌ర్‌!

భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 జాబిల్లిపై ప‌ని ప్రారంభించింది. ఈ మిషన్ లో అత్యంత కీలకమైన పరికరం ప్రగ్యాన్​ రోవర్.. విక్రమ్ ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలంపైకి దిగిన రోవర్ అప్పుడే త‌న పని వేగ‌వంతం చేసింది. చంద్రుడి వాతావరణంలో ఉండే వేడిని ఎంతుందో క‌నిపెట్టిన‌ట్టు ఇస్రో తెలిపింది.

చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 50 డిగ్రీల ఉష్ణోగ్ర‌త ఉన్నట్టు ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్ గుర్తించింది. అంతేకాదు, చంద్రుడి ఉపరితలంపై పది సెంటీమీటర్ల లోతులో ఉష్ణోగ్రత ఎంత ఉందో తెలుసుకునే సామర్థ్యం ప్రగ్యాన్​ రోవర్ కు ఉంది. ఇది 8 సెంటీమీటర్ల లోతులో మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు గుర్తించింది.

ఈ మేరకు సేకరించిన డేటాను విక్రమ్ ల్యాండర్ ద్వారా భూమికి చేరవేసింది. ఓ గ్రాఫ్ రూపంలో ఈ సమాచారాన్ని అందించ‌గా.. దీనిపై ఇస్రో ఓ ప్రకటన విడుద‌ల చేసింది. చంద్రుడి దక్షిణ ధృవంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉంటాయన్న దానిపై ఇప్పటివరకు ఇదే తొలి సమాచారం అని ఇస్రో వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement