ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ గురించి ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని నెడుమారన్ ప్రకటించారు. తంజావూరులో ఇవాళ మీడియాతో మాట్లాడిన నెడుమారన్ కీలక విషయాన్ని వెల్లడించారు. 2009లో శ్రీలంక సైన్యానికి, ఎల్టీటీఈకి మధ్య జరిగిన కాల్పుల్లో ప్రభాకరన్ మరణించాడని, అందుకు సంబంధించిన ఫొటోలను కూడా అప్పటి శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈరోజు తంజావూరులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నెడుమారన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడన్నారు. ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారన్నారు. ప్రభాకరన్ అనుమతితోనే నేను ఈ ప్రకటన చేస్తున్నా. ప్రభాకరన్ గురించి తమిళులకు ఈ శుభవార్త చెప్పేందుకు నేను చాలా సంతోషిస్తున్నా అన్నారు. అయితే, ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు. కానీ, త్వరలోనే తమిళ ఈలం కోసం ఆయన తన కార్యాచరణ ప్రకటిస్తారని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement