Tuesday, November 5, 2024

Power’ful’ war రైతు చుట్టూ రాజ‌కీయం …తెలంగాణ‌లో ప‌వ‌ర్ ఫుల్ వార్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో ఉచిత విద్యుత్‌పై రేగిన రాజకీయ మంటలు ఇప్పట్లో చల్లారే అవకాశం కనిపించడం లేదు. శాసనసభ ఎన్నికలకు ముందు తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఉచిత విద్యుత్‌ వ్యవహారం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నడుమ పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో బీజేపీ రంగప్రవేశం చేయడంతో ఉచిత విద్యుత్‌ వ్యవహారం మరింత వేడి పుట్టిస్తోంది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల విద్యుత్‌కు కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర వ్యతిరేకమంటూ అధికార పార్టీ భారాస మాటల దాడికి దిగుతుండగా అదే స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రతి దాడికి దిగి భారాసపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఉచిత విద్యుత్‌పై మాట్లాడే అర్హత భారాసకు లేదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టారని, అందుకే ఈ అంశం తమ పార్టీ పే-టె-ంట్‌ అని కాంగ్రెస్‌ నేతలు తెగేసి చెబుతున్నారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రకటించిన మూడు గంటల విద్యుత్‌ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు భారాస ఇప్పటికే రంగంలోకి దిగింది.

సోమవారం నుంచి పది రోజులపాటు- తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైతు వేదికల్లో సమావేశాలను ఏర్పాటు- చేసి కాంగ్రెస్‌ పార్టీ విధానాన్ని తూర్పారబట్టాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ-, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ- రామారావు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తొలి రోజు జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని కాంగ్రెస్‌ పార్టీ ఉచిత విద్యుత్‌పై చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కాగా భారాస ఇచ్చిన పిలుపును తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ మరో ప్రణాళికను సిద్ధం చేసింది. పార్టీ అనుబంధ వ్యవసాయ సంఘం కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బుధవారం నుంచి బస్సుయాత్రలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన ప్రాంతాలకు వెళ్లి అక్కడ రైతులతో సమావేశమై 24 గంటల ఉచిత విద్యుత్‌ బూటకమని వివరించనుంది

. రెండు వారాలకు పైగా సాగే ఈ యాత్రలో సబ్‌స్టేషన్లను సందర్శించి ప్రభుత్వ నిర్వాకాన్ని, రైతులకు ఉచిత విద్యుత్‌ పేరుతో చేస్తున్న దగాను బహిర్గతం చేయాలని నిర్ణయించారు. కాగా వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధోగతిపాలు చేసేందుకు కుట్రపన్నిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. వ్యవసాయ రంగానికి కేసీఆర్‌ ప్రభుత్వం 24గంటల పాటు- నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీకి కడుపు మండుతోందని భారాస మంత్రులు సోమవారం రాష్ట్రంలోని రైతు వేదికల్లో నిర్వహించిన కర్షకుల సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తగా విద్యుత్‌ అంశాన్ని తమ పార్టీ ప్రస్తావించిన తర్వాతే కేసీఆర్‌ సర్కార్‌ విద్యుత్‌ వ్యవహారంపై మాట్లాడడం మొదలు పెట్టిందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

విద్యుత్‌ సమస్య, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై భారాస సర్కార్‌ను, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు విద్యుత్‌ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు భారాస వ్యూహం రచిస్తుండగా సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదవ ఏట అడుగు పెట్టినా ఆయనిచ్చిన రుణమాఫీ హామీ అమలు చేయలేదని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఒకసారి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్‌) అమల్లోకి వస్తే ప్రభుత్వం ఎటు-వంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదని కోడ్‌ను అడ్డం పెట్టు-కుని రుణమాఫీని ఎగ్గొట్టేందుకు సీఎం కేసీఆర్‌ కుట్రలకు దిగుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని రైతు లోకానికి తెలియజెప్పాలని పార్టీ నాయకత్వం శ్రేణులను కోరింది. ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయదన్న విషయాన్ని ఊరూరా తిరిగి దండోరా వేయడంతో పాటు- ప్రతి గడప తొక్కి ఓటర్లు, ప్రజలకు తెలియజెప్పేందుకు భారీ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కూడా కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసిందని తెలుస్తోంది.

- Advertisement -

ఉచిత విద్యుత్‌ పచ్చి బూటకం: భాజపా ఎంపీ అర్వింద్‌
24 గంటల విద్యుత్‌ సరఫరాపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్తున్న మాటలన్నీ అవాస్తవాలని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. అసలు రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ సరఫరా జరగడం లేదన్నారు. డ్రగ్స్‌ మత్తులో ఉండే మంత్రి కేటీ-ఆర్‌కు ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. మంత్రి కేటీ-ఆర్‌ మత్తులో నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని సూచించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం గండి హనుమాన్‌ ఆలయం వద్ద ఏర్పాటు- చేసిన కోరుట్ల నియోజవర్గ బీజేపీ నాయకుల టిఫిన్‌ బైఠక్‌ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు. కుల రాజకీయాలు చేసే కాంగ్రెస్‌కు.. కుటు-ంబ రాజకీయాలు చేసే బీఆర్‌ఎస్‌కు అభివృద్ధి అవసరం లేదని మండిపడ్డారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌.. లక్షసార్లు చీలిందన్నారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఆ పార్టీ ఎన్నోసార్లు చీలిందని గుర్తు చేశారు. కానీ బీజేపీ వసుదైక కుటుంబ పార్టీ అన్నారు. అందరూ కుటు-ంబ సభ్యుల్లా కలిసి చర్చించుకోవడానికి టిఫిన్‌ బైఠక్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అందరూ ఐకమత్యంగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement