మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ట్విటర్లో ట్రెండ్ అవుతున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన్ను ట్విటర్లో విమర్శలతో హోరెత్తిస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని ఎద్దేవా చేశారు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి కోపమొచ్చింది. దీంతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను టార్గెట్ చేశారు.
‘సిగ్గలేని వెదవ వెల్లంపల్లి’హ్యాష్ ట్యాగ్‌తో ట్విటర్ విమర్శలు కురిపిస్తున్నారు. గతంలో పవన్ టీషర్టును పబ్లిసిటీ కోసం లాంచ్ చేసిన వెల్లంపల్లి ఫొటోలను పెట్టి ఎద్దేవా చేస్తున్నారు. పవన్ చెబితే తనకు ఓట్లు పతాయని వెల్లంపల్లి అన్నట్టుగా ఫొటోలు డిజైన్ చేసి మరీ ట్విటర్‌ను హోరెత్తిస్తున్నారు. 420, 6093,36 అంటూ వెల్లంపల్లిపై మండిపడుతున్నారు. అంతేకాదు వెల్లంపల్లిని విమర్శించేందుకు తమతో జాయిన్ కావాలని పలువురికి రిక్వెస్టులు పెడుతున్నారు. మరి ఈ అంశంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనవాస్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.