Tuesday, November 26, 2024

వ్యర్థాల నుంచి వెలుగులు.. దుండిగల్‌లో 14.5 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌..

వ్యర్థాల నుండి తయారయ్యే మరో విద్యుత్‌ (వేస్ట్ టూ ఎనర్జీ) ప్రాజెక్టు ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ ముందుకొచ్చింది. ఈ ప్లాంట్‌ను దుండిగల్‌లో ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇంటిగ్రేటెడ్‌ మున్సిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌(ఐఎంఎస్‌డబ్ల్యూఎం) ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డులో 19.8 మెగావాట్ల విద్యుత్‌ను తయారు చేస్తున్న పాఠకులకు విధితమే. జీహెచ్‌ఎంసీ దాని చుట్టు ప్రక్కల పట్టణ ప్రాంతాలకు చెందిన చెత్తను జవహర్‌ నగర్‌ డంప్‌ యార్డుకు తరలించే ప్రక్రియను సమగ్ర మున్సిపల్‌ ఘన పదార్థాల నిర్వహణ ప్రాజెక్టు (ఐఎంఎస్‌డబ్ల్యూఎం) గా చేపట్టిన విషయం విధితమే.

ఇంటి నుంచి చెత్త సేకరణ – విద్యుత్‌ వెలుగులు..

ఇళ్ల నుండి సేకరించిన చెత్తను సెకండరీ కలెక్షన్‌, ట్రాన్స్‌ఫర్‌ పాయింట్స్‌(ఎస్సీటీ-పీ) నుండి వ్యర్థాలను జవహర్‌ నగర్‌ డంప్‌ యార్డుకు తరలిస్తారు. అక్కడ యాంత్రికంగా సెగ్రిగేట్‌ చేసిన తర్వాత మండే గుణం గల వ్యర్థాలను వేరు చేస్తారు. 19.80 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు రోజుకు 1200 నుండి 1500 టన్నుల వ్యర్థాలు అవసరం ఉంటుంది. ఆ విధంగా ఆగస్టు 2020 నుండి నవంబర్‌ 2021 వరకు 5.4 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆర్డీఎఫ్‌(రెఫ్యూస్‌ డెరివుడ్‌ ఫ్యూయల్‌) వ్యర్థాలను వినియోగించి, ఇప్పటి వరకు 185 మిలియన్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జీహెచ్‌ఎంసీ ద్వారా 6,500 టన్నుల పైబడి చెత్తతో పాటు, చుట్టూ ప్రక్కల వున్న 17 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా ప్రతిరోజూ 600 టన్నుల చెత్తతో మొత్తం 7వేల టన్నుల వ్యర్థాలు జవహర్‌ నగర్‌ డంప్‌ యార్డుకు తరలిస్తున్నారు. పేరుకు పోయిన వ్యర్థాల వలన పక్కన ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరోధించేందుకు 19.8 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను 48 మెగావాట్లకు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఆ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతినిచ్చిన నేపథ్యంలో ఆయా పనులను 18 నెలల్లో పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎండీ అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

జవహర్‌ నగర్‌పై తగ్గనున్న భారం..

ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్‌తో జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డుపై భారం తగ్గనుంది. దుండిగల్‌లో గల ట్రీట్‌మెంట్‌ స్టోరేజ్‌ డిస్పోజల్‌ ఫెసిలిటీకి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే భూమిలో సిద్ధం చేశారు. మిగిలిన విద్యుత్‌ ప్లాంట్‌ పనులను పూర్తి చేసి సెప్టెంబర్‌ 2022 నుండి ఉత్పత్తిని ప్రారంభిస్తారు. వ్యర్థం నుండి విద్యుదుత్పత్తి చేసేందుకు అవసరమైన చెత్తను దుండిగల్‌ పరిసర పట్టణ ప్రాంతాల నుండి, జీహెచ్‌ఎం సీ పరిధిలో గల ప్లాంట్‌కు సమీపంలో గల ప్రాంతాల నుండి తరలిస్తారు. దీంతో జవహర్‌ నగర్‌ డంప్‌ యార్డుకు కొంచెం భారం తగ్గే అవకాశం ఉంది. 14.5 మెగా వాట్ల విద్యుదుత్పత్తికి 1000 టన్నుల వ్యర్థం అవసరం ఉంటు-ంది. వ్యర్థం నుండి విద్యుత్‌ తయారీకి యాప్రాల్‌లో 14 మెగావాట్లు-, బీబీనగర్‌ దగ్గర చిన్నరేవులపల్లిలో 11 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ప్రైవేటు- సంస్థలు ముందుకు వచ్చినప్పటికీ వివిధ కారణాల వలన ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయలేక పోతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement