Tuesday, November 26, 2024

ఇండియాలో భారీగా పెరిగిన పేదరికం

కరోనా మహమ్మారి భారత్‌లో చాలామందిని తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా వల్ల దెబ్బతినని రంగమంటూ లేదు. కరోనా వల్ల భారత్‌లో మధ్య తరగతి జనాభా తగ్గిపోయి పేద జనాభా విపరీతంగా పెరిగిపోయారు. 2020లో మధ్యతరగతి జనాభా 3.2 కోట్లకు పైగా తగ్గిందని, మరో 7.5 కోట్ల మంది పేదరికంలోకి వచ్చేశారని ప్యూ రీసెర్చి సెంటర్‌ నివేదిక వెల్లడించింది. 2021లో మధ్య తరగతి జనభా సంఖ్య 9.9 కోట్ల నుంచి 6.6 కోట్లకు.. పేదల ప్రజల (బిలో పావర్టీ లైన్) సంఖ్య 5.9 కోట్ల నుంచి 13.4 కోట్లకు చేరుతుందని పేర్కొంది.

ఈ విషయంలో చైనా మెరుగ్గా ఉందని.. ఆ దేశ మధ్యతరగతి జనాభా కోటి తగ్గిందని, పేదల సంఖ్యలో మార్పులేదని స్పష్టం చేసింది. అటు 2020లో పేదరికం రేటు 9.7 శాతంగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. భారత్‌లో జనాభాను ప్యూ రీసెర్చి ఏజెన్సీ వారు ఐదు వర్గాలుగా విభజించి ఈ నివేదికను రూపొందించారు. రోజూ రూ.150 కంటే తక్కువ ఆదాయంతో జీవించే వారిని పేదవారుగా వర్గీకరించి నివేదికలో పేర్కొంది. రోజుకు రూ.700-రూ.1500 సంపాదించేవారిని మధ్యతరగతి వారిగానూ, రోజుకు రూ.1500-రూ.3,500 సంపాదించేవారిని ఎగువ మధ్యతరగతి వారిగానూ, రోజుకు రూ.3,500 కంటే ఎక్కువ సంపాదించేవారిని అధిక ఆదాయ వర్గంగా నివేదిక అభిప్రాయపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement