Friday, November 22, 2024

భారీ నౌక‌లో మంట‌లు – కాలిపోయిన‌ ల‌గ్జ‌రీ కార్లు

అట్లాంటిక స‌ముద్రంలో భారీ నౌక పోర్చుగ‌ల్ లోని అసోర్స్ దీవుల స‌మీపంలో అగ్ని ప్ర‌మాదానికి గురి అయింది. ల‌గ్జ‌రీ కార్ల‌ను తీసుకువెళ్తోంది ఈ నౌక‌. షిప్ లోని కార్లనీ అగ్నికి ఆహుత‌య్యాయి. జర్మనీ నుండి యునైటెడ్ స్టేట్స్‌కు అట్లాంటిక్ సముద్రయానంలో ఉన్న వాహన రవాణా నౌక వద్దకు పోర్చుగీస్ నావికాదళ నౌక వెళ్లింది. మంటలు చెలరేగడంతో 22 మంది సిబ్బంది ఉన్న ఈ భారీ నౌకను ఖాళీ చేయించారు. పోర్చుగీస్ వైమానిక దళం ఫెలిసిటీ ఏస్‌లో ఉన్న సిబ్బందిని రక్షించిన వీడియోను విడుదల చేసింది. సిబ్బందిని హెలికాప్టర్‌ లో 170 కిలోమీటర్ల (100 మైళ్ళు) దూరంలో ఉన్న ద్వీప సమూహంలోని ఫైయల్ ద్వీపానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక హోటల్‌లో వారికి ఆశ్రయమిచ్చారు.

వారిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోర్చుగల్ నేవీ తెలిపింది. నేవీ విడుదల చేసిన ఓ ప్రకటనలో మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయని తెలిపింది. పోర్చుగీస్ నౌకాదళ ప్రతినిధి జోసే సౌసా లూయిస్ మాట్లాడుతూ…ఆ కార్గో షిప్ లోని సిబ్బందిని టేకాఫ్ చేసిన తర్వాత 200 మీటర్ల పొడవు (650 అడుగుల పొడవు) గల”ఫెలిసిటీ ఏస్” కొట్టుకుపోయిందని తెలిపారు. కార్గో ఓడ మునిగిపోయే ప్రమాదం ఉందా.. లేదా కాలుష్యానికి కారణమవుతుందా అనేది తనిఖీ చేయవలసి ఉందని లూయిస్ అన్నారు. ఫెలిసిటీ ఏస్.. దాని పరిమాణం కారణంగా పోర్చుగల్‌లోని అజోర్స్ దీవులలోని ఓడరేవుకు లాగబడే అవకాశం లేదని అతను చెప్పాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement