ఓ పాప్ స్టార్ నదిని దాటుతుండగా మంచులో కూరుకుపోయి మరణించాడు. దిమా నోవా అసలు పేరు దిమిత్రి స్విర్గునోవ్ . ‘క్రీమ్ సోడా అనే పాపులర్ ఎలక్ట్రానిక్ గ్రూప్‌ను స్థాపించాడు. ఈ నెల 19న తన సోదరుడు, ముగ్గురు స్నేహితులతో కలిసి గడ్డకట్టిన వోల్గా నది ని దాటుతుండగా మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. మంచుకింద చిక్కుకున్న అతడి స్నేహితులు ఇద్దరినీ రక్షించగా, మరో స్నేహితుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ దిమా నోవా తరచూ తన పాటలతో అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శించేవాడు. రష్యాలో జరిగిన యుద్ధ వ్యతిరేక నిరసనల సమయంలో అతడి సంగీతాన్ని ఒక గీతంలా ఉపయోగించేవారు. చాలా పాపులర్ అయిన, వివాదాస్పద పాట ‘ఆక్వా డిస్కో’. రష్యాలో ఆందోళనల సమయంలో ఈ పాటను ఎక్కువగా ఆలపించేవారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement