Saturday, November 23, 2024

ముస్లిం యువతితో మ్యారేజ్​.. పూరకళి కళాకారుడిపై గుడిలోకి రాకుండా నిషేధం

ఓ గుడిలో నృత్యం చేసే కళాకారుడి కొడుకు ముస్లిం యువతిని పెళ్లాడాడన్న కారణంతో అతని ప్రదర్శన జరగకుండా నిషేధించారు. ఈ ఘటన కేరళ రాష్ట్రం ఉత్తర మలబార్​లో జరిగింది. టెంపుల్​ అడ్మినిస్ట్రేషన్ పూరకళి కళాకారుడి కుమారుడు ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడనే ఆరోపణలతో దేవాలయాలలో ప్రదర్శన చేయకుండా నిషేధం విధించారు. కన్నూర్‌కు చెందిన పూరక్కళి నృత్యకారుడు వినోద్‌ పనికర్‌ ఇంట్లో హిందుయేతరుడు నివాసం ఉంటున్నాడంటూ కునియన్‌ భగవతి ఆలయ కమిటీ అతనిపై ఈ చర్యలు చేపట్టింది.

పూరక్కళి అనేది కేరళలోని పూరం ఆలయ ఉత్సవంలో ప్రదర్శించబడే ఒక సాంప్రదాయ నృత్య ఆచారం. జరగాల్సి ఉన్న ఓ ఈవెంట్ నుండి వినోద్ పనికర్ ను తొలగించారు. అతని ప్లేస్​లో మరో వ్యక్తిని నియమించుకున్నారు. కాగా, తనపై నిషేధం విధించినప్పటికీ తన కోడలిని తిరస్కరించనని పణికర్ అన్నారు. ప్రస్తుతం తన కుమారుడికి పెళ్లయి నాలుగేళ్లు అవుతోంది. ఈ కాలంలో పనికర్ వివిధ దేవాలయాలలో ప్రదర్శనలు ఇస్తున్నారు.

కన్నూర్‌లోని కరివెల్లూర్‌లోని దేవాలయాలు తనకు ప్రదర్శన ఇచ్చే అవకాశాన్ని నిరాకరించడం ఇదే తొలిసారి అని పనికర్ చెప్పారు. నా కోడలు మా ఇంట్లో ఉన్నప్పుడు నేను కర్మ నృత్యం చేయలేనని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. కర్మ సమయంలో ఆమెను వేరే ఇంటికి మార్చమని లేదా నా కోడలిని వేరే ప్రదేశానికి తీసుకెళ్లాలని వారు చెప్పారు. అయితే, నేను ఈ ప్రతిపాదనలను అంగీకరించలేదని పనికర్​ తెలిపాడు.

అయితే.. తాము ఆలయ ఆచారాలను ఉల్లంఘించలేమని ఆలయ అధికారులు తేల్చి చెప్పారు. హిందువులు కానివారు నివసించే ఇంటి నుండి ఆచారాలు నిర్వహించరాదు. అతనిపై ఎలాంటి నిషేధం విధించలేదు. తమ ప్రతిపాదనను అంగీకరించడానికి ఆయన నిరాకరించారు అని ఆలయ కమిటీ సభ్యుడు తెలిపారు. మరోవైపు నిషేధానికి వ్యతిరేకంగా కరివెల్లూరులో నిరసనలు వెల్లువెత్తడంతో పాటు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్‌ఐ) కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) కన్నూర్ జిల్లా కార్యదర్శి ఎంవీ జయరాజన్ మాట్లాడుతూ కళాభిమానులపై కొన్ని ఆలయ కమిటీలు ఆంక్షలు విధించడాన్ని సమాజం అంగీకరించదని అన్నారు. “ప్రజలను విభజించే సాధనంగా కళను ఉపయోగించకూడదు. కుటుంబ నేపథ్యం తెలిసినా పనికర్‌ని తమ దేవాలయాల్లో ప్రదర్శనకు ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులను అభినందించాలి’’ అని జయరాజన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement