వరి ధాన్యం కొనుగోలు విషయంలో కెసిఆర్ వైట్ పేపర్ రిలీజ్ చేయాలని మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. వైట్ పేపర్ ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. రాత పూర్వకంగా ఉన్న వివరాలను బయట పెడితే తప్పెవరిదో తెలుస్తుంది కదా అని అన్నారు. రైతాంగం మద్దతు తగ్గుతున్న నేపథ్యంలో రోజు రోజుకి ప్రజాకర్షణ తగ్గుతోందని, దానిని మరుగున పెట్టడానికి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో నాటకాలు ఆడుతూ రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు ముడిబియ్యం, ఉప్పుడు బియ్యం , ధాన్యం పేరుతో రైతాంగాన్ని కెసిఆర్ మభ్య పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించినా వానాకాలం సీజన్లో కావాలనే 55 రోజులు ఆలస్యం చేసి మిల్లల్లర్లకు దోచిపెట్టారని ఆరోపించారు. ఇందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాదానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణం కాదా ? అని నిలదీశారు. మళ్లీ ఈరోజు రా రైస్, ముడిబియ్యం, ఉప్పుడు బియ్యం, ధాన్యం ఈ మూడు మాటలతోటి రైతాంగాన్ని కెసిఆర్
మభ్య పెడుతున్నాడని ధ్వజమెత్తారు. తాము ఐకెపి సెంటర్లకి పోయి ధాన్యం కొనడం లేదు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అన్ని వివరాలు పెట్టాం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించినా కావాలనే 55 రోజులు ఆలస్యం చేశారన్నారు. మొదట సేకరించాలిసిన 60 లక్షల టన్నులు సేకించకుండా 10 లక్షల టన్నులు అదనంగా ఇచ్చారని 60 రోజుల తర్వాత చెప్పారని పేర్కొన్నారు. దానివల్ల రైతులు ఎంత నష్టపోయారు తెలియదా ? అని ప్రశ్నించారు. దీనికి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని అన్నారు.
ఇంత కాలం మోడీకి మద్దతుగా నిలిచి కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి, నిర్ణయానికి మద్దతిచ్చిన కేసీఆర్ కు.. ముఖ్యమంత్రిగా 8 ఏళ్లు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు నేషనల్ ప్రొక్యూర్మెంట్ విధానం గుర్తుకు వచ్చిందా? అని అడిగారు. పరిపాలన అంటే ఇదా కేసీఆర్ ? అంటూ మండిపడ్డారు. యాసంగిలో 70 లక్షల ధాన్యం కొంటే 10 శాతం నష్టం అవుతుంది ( నూకల ద్వారా ) అని అన్నారు. రైతులకు మద్దతు ధర రాకుండా చేసే దౌర్భాగ్యపు పని కేసీఆర్ చేస్తున్నాడని ఆరోపించారు. 24 గంటల కరెంటు, రైతుబంధు, ప్రాజెక్టులు కట్టాను అంటున్న కేసీఆర్.. వరి వేస్తే ఉరి అని ఎందుకు అన్నారని ప్రశ్నించారు. కెసిఆర్ ఉపయోగించే తెలివితేటలు తెలంగాణ ప్రజలకు మంచి చేకూరే విధంగా ఉండాలని హితవు పలికారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ప్రజలు రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సైడ్ ట్రాక్ చేసి దానిలో భాగంగా కెసిఆర్ బిజెపి రెండు నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినా ఎగువ రాష్ట్రాల నుండి వివాదాలు లేవని గుర్తుచేశారు. డబ్బులు ఖర్చు పెట్టి దోపిడీ చేసి ప్రాజెక్టులు తీసుకొచ్చి వివాదాలు తీసుకొచ్చారని మండిపడ్డారు. అందుకే వైట్ పేపర్ రిలీజ్ చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు.