ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజారిటీ అసెంబ్లి స్థానాలను ఎగరేసుకుపోయేందుకు ఇటీవల రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఆయన ఢిల్లిd కేంద్రంగా తనదైన శైలిలో పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల కేటాయింపునకు సంబంధించి ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వ పెద్దలను ఒప్పించినట్టు సమాచారం. ఇదే జరిగితే పార్టీ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వర్గానికి ఒకటి రెండు సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని సమాచారం. జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి వర్గానికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇచ్చే సూచనలు కనిపించడం లేదని, ఆమె అనుయాయులకు రిక్తహస్తమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్వేలు, ఆర్థిక బలం పేరుతో పార్టీ పెద్దలు సీఎల్పీ నేత విక్రమార్క, రేణుకా చౌదరి వర్గాలకు అసెంబ్లిd ఎన్నికల్లో మొండి చేయి చూపించే ప్రమాదం ఉందని తెలుస్తోంది…
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో:
కాంగ్రెస్‌లో కీలక నేతలైన భట్టి విక్రమార్క, రేణుక చౌదరి వర్గాలకు సంబంధించి ఈ ఎన్నికల్లో పోటీకి ప్రాధాన్యత దక్కకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అనుమానాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు సానుకూలమైన వాతావరణం ఉందని పొంగులేటి చివరి క్షణంలో చక్రం తిప్పి తన మనుషుల కు టికెట్లు తెచ్చుకుని ఎన్నికల బరిలో దిగితే పరిస్థితి తారుమారు అవుతుందని ఆ నేత చెప్పారు. పార్టీ అగ్రనేత మల్లు భట్టి విక్రమార్క.. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, భారాస ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఎండనకా వాననకా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం వరకు 1360 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలు, యువత, రైతులకు ఎన్నో హామీలిచ్చారు. పాదయాత్రతో ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. జరిగిన నష్టాన్ని అధిగమించేందుకు సీఎం కేసీఆర్ తన వ్యూహాలకు పదును కూడా పెట్టారు.
ఈ తరుణంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన భట్టి వర్గానికి ఎన్నికల్లో ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నాలు ఊపందుకున్నాయన్న ప్రచారం జరుగుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంతో సహా కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్యకు మాత్రమే అసెంబ్లి ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను పొంగులేటి తన అనుచర బృందానికి ఇప్పించే ప్రయత్నాలు సాగుతున్నట్టు జిల్లా కాంగ్రెస్‌లో నేతలు చర్చించుకుంటున్నట్టు సమాచారం. వాస్తవానికి జిల్లాలోని ఖమ్మం,పాలేరు, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, మధిర, సత్తుపల్లి నియోజక వర్గాల్లో భారాసను మట్టికరిపించే ధీటైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎంపిక చేసి వారిని ప్రజల్లోనే ఉండి వారితో మమేకం కావాలని ఆదేశించింది.
పార్టీ పెద్దల సూచన మేరకు భట్టి ఆశీస్సులు కలిగిన పలువురు నేతలు నియోజకవర్గాల్లో ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వలసవాదులు పార్టీ టికెట్లను ఎగురేసుకుని వారి అనుయాయులతో పోటీ చేయించాలన్న ప్రయత్నం జరిగితే అడ్డుకుని తీరుతామని ఆశావహులు ఇప్పటికే గట్టి హచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు అడుగులో అడిగేసి పార్టీ కోసం త్యాగాలు చేసిన వారెంతో మంది కాంగ్రెస్‌లో ఉన్నారని, వలసపక్షులు రంగ ప్రవేశం చేసి అసెంబ్లి టికెట్లను హస్తగతం చేసుకుంటే తాము చూస్తూ ఉండాలా అంటూ భట్టి వర్గం ఆశావహులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నట్టు సమాచారం. సర్వేలు, ఆర్థిక బలం పేరుతో ఒకటి రెండు మినహా మొత్తం అసెంబ్లి స్థానాలను వలసవాదుల కబంధ #హస్తాల్లో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.
కాగా పినపాక నియోజకవర్గం బరిలో చందా సంతోష్ ఉన్నారు. ఆయనకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క టికెట్ హామీ కుడా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు పొంగులేటి టికెట్ ఇప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. భద్రాచలం సెగ్మెంట్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య పేరు దాదాపు ఖరారైనా పొంగులేటి తన అనుయాయుడిని పోటీ చేయించాలన్న పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. తెల్లం వెంకట్రావును ఇక్కడ బరిలో నిలిపేందుకు పొంగులేటి ప్రయత్నాలను సాగిస్తున్నట్టు ్ఖసమాచారం. కొత్తగూడెం సెగ్మెంట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత పోట్ల నాగేశ్వర్‌రావు ఆశలు పెట్టుక్ఖున్నారు. రేణుకా చౌదరికి అత్యంత సన్ని#హతుడు యడవల్లి కృష్ణ కూడా ఈ నియోకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. గత ఐదేళ్లుగా ప్రజల్లోనే ఉంటూ పోరాడుతున్నారు. పొంగులేటి ఈ నియోజకవర్గం నుంచే పోటీకి దిగే అవకాశాలున్నట్టు ఆయన సన్నిహతులు చెబుతున్నారు. పొంగులేటి పోటీ చేయని పక్షంలో ఊకంటి గోపాలరావు, బ్రహ్మయ్యలలో ఒకరికి టికెట్ కోరే అవకాశం ఉంది. ఇల్లందు నుంచి కోరం కనకయ్యకు బీఫామ్ ఇప్పించేందుకు పొంగులేటి పట్టుబట్టే అవకాశం ఉంది.
అశ్వారావుపేట అసెంబ్లి నియోజకవర్గం టికెట్‌ను జారే ఆదినారాయణ, వైరాకు విజయ, సత్తుపల్లి కొండూరి సుధాకర్‌లకు టికెట్లను ఇప్పిస్తానని పొంగులేటి ఇప్పటికే హామీ ఇచ్చారన్న ప్రచారం ఉంది. ఖమ్మం అసెంబ్లి నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్‌లలో ఒకరికి టికెట్ తధ్యమని ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. అనూహ్యంగా పొంగులేటి కూడా ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగి మంత్రి పువ్వాడ అజయ్‌ను ఓడించాలన్న కసితో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంటే ఖమ్మం అసెంబ్లికి మువ్వా విజయబాబుకు ఇప్పించే అవకాశం ఉందని సమాచారం.
భట్టి విక్రమార్క సొంత నియోజక వర్గంలో డాక్టర్ కోటా రాంబాబును పోటీకి పెట్టాలని కాంగ్రెస్‌లో చేరకముందు పొంగులేటి భావించినట్టు సమాచారం. పాలేరులో వ్యాపారవేత్త రాయల నాగేశ్వర్‌రావు అభ్యర్థిత్వాన్ని భట్టి విక్రమార్క ఇప్పటికే ఖరారు చేయగా ఇక్కడి నుంచి మద్దినేని బేబీ స్వర్ణ కుమారి లేదా పొంగులేటి ప్రసాదరెడ్డిని బరిలోకి దించే ప్రయత్నాలను పొంగులేటి సాగిస్తున్నట్టు చెబుతున్నారు. వైరాలో బాలాజీ నాయక్‌ను పోటీ చేయించాలని ఇప్పటికే భట్టి విక్రమార్క నిర్ణయించి ప్రజల్లో ఉండాలని కోరారు. సత్తుపల్లి నుంచి కొండూరు సుధాకర్‌ను పొంగులేటి సిఫారసు చేసే అవకాశం ఉందని సమాచారం.
జనగర్జన సభ హైజాక్ చేశారని కినుక వహించిన భట్టి వర్గం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ జనగర్జనను పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హజాక్ చేసి తనకు మైలేజ్ వచ్చే విధంగా చేసుకున్నారన్న ఆగ్రహంతో భట్టి వర్గం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మండుటెండల్లో కాళ్లు బొబ్బలు కట్టేలా పాదయాత్ర చేసి భారీ బహరంగ సభ నిర్వహస్తే వచ్చిన ప్రతిఫలం శూన్యమని, పార్టీ పూర్వ వైభవం కోసం వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే వలస పక్షులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. పొంగులేటి కాంగ్రెస్‌లో భట్టి సభను తక్కువ చేసి చూపించే కుట్ర జరిగిందన్న చర్చ జరుగుతోంది. ఖమ్మం సభ వ్యక్తి ఆరాధన సభగా పార్టీలోని కొందరు పెద్దలు మార్చి దళిత నేత భట్టి త్యాగాన్ని అవమానించే విధంగా వ్యవ#హరించారని, ఇలా జరుగుతుందని అసలు ఊ#హంచలేదని ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.