ఒక్కోసారి మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. దాంతో అవాక్కు అవ్వడం మాటేమోగాని, ప్రాణాలు కూడా పోతుంటాయి. వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంకలో పొంగల్ సందర్భంగా పెద్ద గాలిపటాలను ఎగురవేస్తుంటారు. కాగా ఈ మేరకు జాఫ్నాలోని పాయింట్ పెడ్రోలో పతంగుల పోటీని చేపట్టారు. ఈ పోటీల్లో భాగంగా యువకులు పెద్ద పెద్ద గాలి పటాలు ఎగురవేశారు. కాగా ఓ గ్రూపులో పెద్ద పతంగి ఎగురవేస్తూ.. దాని తాడును ఒక్కసారిగా వదిలారు. ఓ వ్యక్తి తాడు విడవకపోవడంతో గాలిపటంతోపాటే గాల్లోకి 30 అడుగుల ఎత్తుకు లేచాడు. నిమిషంపాటు గాల్లోనే వేల్లాడిన ఆ వ్యక్తి పతంగి కొంచెం కిందకు దిగగా.. తాడు వదిలి భూమ్మీద దూకాడు. దాదాపు పదిహేను ఇరవై అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకడంతో ఆ యువకుడి కాళ్లు విరిగాయని సమాచారం. ఇదంతా ఓ వీడియోలో రికార్డు కాగా.. ఆ వీడియో సోషల్ మీడియాలోవైరల్ అయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..