Monday, November 25, 2024

కాలుష్యంలో మొద‌టిస్థానంలో లాహోర్..

క‌రోనాతో పాటు కాలుష్య స‌మ‌స్య కూడా ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఢిల్లీలో అత్యంత కాలుష్యంతో అక్క‌డి జ‌నం ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. కాగా ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత కాలుష్య న‌గ‌రాల జాబితాలో పాకిస్థాన్ న‌గ‌రం లాహోర్ నిలిచింది. ఓ నివేదిక ప్రకారం లాహోర్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియాలోని ఢిల్లీ, కోల్ కతాలు వరసగా మూడు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మనకు లాగే పాకిస్థాన్ లోని పంజాబ్ లో కూడా రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెట్టడంతో లాహోర్ లో కాలుష్యం పెరుగుతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన గాలి నాణ్యత పరిశీలన సంస్థ ఐక్యూఎయిర్‌ ఈ విషయాన్ని తమ నివేదికలో వెల్లడించింది. వాయునాణ్యత సూచీ(ఏక్యూఐ)లో లాహోర్‌కు ఏకంగా 233 పాయింట్లు రాగా.. ఢిల్లీకి 216 పాయింట్లు వచ్చాయని ఆ సంస్థ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement