బెంగాల్ లో ఆరో విడత పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్ ల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 43 నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 303 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో నాలుగు జిల్లాల్లోని 14,480 పోలింగ్ స్టేషన్ల లో ఓటింగ్ జరుగుతుంది.
నాలుగు, ఐదో దశ ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను వినియోగిస్తున్నారు. పోలింగ్ జరుగుతున్న 43 నియోజకవర్గాల్లో 1071 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు అధికారులు వివరించారు. కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.