Saturday, November 23, 2024

Movie | బేషరమ్​ పాటపై పెనుదుమారం.. పఠాన్​ సినిమా బ్యాన్​ చేయాలంటూ ట్రోలింగ్​!

బాలివుడ్​ కింగ్​ షారుఖ్​ ఖాన్​, కుర్రాళ్ల కలల దేవత దీపికా పదుకొణె నటించిన పఠాన్​ సినిమాలోని ఓ పాట ఇప్పుడు యావత్​ దేశమంతా పెను దుమారం రేపుతోంది. ఈ సినిమా పాటలో దీపికా అసభ్యంగా నటించారని, ఆమె వస్త్రధారణ సరిగా లేదని, ఆడాళ్ల మనోభావాలు కించపరిచేలా నటించారన్న కామెంట్స్​ వినిపిస్తున్నాయి. అయితే.. ఈ ‘బేషరమ్​ రంగ్​’ పాటపై సోషల్​ మీడియాలోనూ పెద్ద ఎత్తున ట్రోలింగ్​ జరుగుతోంది. అంతేకాకుండా పఠాన్​ మూవీని బాయ్​కాట్​ చేయాలన్న ఆందోళన, లేదు లేదు మొత్తానికే బ్యాన్​ చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన పఠాన్ సినిమా పాట ‘బేషరమ్ రంగ్’ సోషల్​ మీడియాలో ట్రోలింగ్​తో తుపాను సృష్టిస్తోంది. – రాజకీయ వర్గాల్లోనూ పెను దుమారమే రేపుతోంది.  బేషరమ్ రంగ్ అనే పాటలో కాషాయ దుస్తులు ధరించి ఉండడాన్ని కూడా బీజేపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ఇక  JNUలో బీజేపీ నిరసనలు చేపట్టింది.

కాగా, పఠాన్ సినిమా సాంగ్​ని వ్యతిరేకించిన వారిలో మధ్యప్రదేశ్ హోం మంత్రి డాక్టర్ నరోత్తమ్ మిశ్రా ముందు వరుసలో ఉన్నారు. ఈ పాటలో దీపికా కాషాయ దుస్తులు ధరించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని షాట్లను తీసేయకుంటే ‘పఠాన్’ సినిమా మధ్య ప్రదేశ్​ రాష్ట్రంలో విడుదలయ్యేది లేదని ఆయన గట్టిగా చెప్పారు. నటి దీపికా పదుకొణె ‘తుక్డే తుక్డే’ డ్రెస్​లతో దారుణంగా కనిపిస్తున్నారని, ఆమెను పాటలో అత్యంత దారుణంగా చూపించారని ఆయన విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వీర్ శివాజీ గ్రూప్ కార్యకర్తలు దీపికా పదుకొణె, షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోనూ ఇట్లాంటి నిరసనలు జరిగాయి. అక్కడ బీజేపీ కార్యకర్తలు సినిమా నిర్మాతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమాను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ ఈ సినిమా నిర్మాతలపై కఠిన చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డును కోరారు. సినిమా విడుదలైతే నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  కాగా, పఠాన్ సినిమా జనవరి 25వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది.   

తెలుగులో : షారుఖ్ ఖాన్ చిత్రం పఠాన్‌లో కాషాయ మరియు హిందూ సంస్కృతాన్ని అవమానించారు, ఫిల్మ్ సెన్సార్ బోర్డు ఎందుకు నిద్రపోతోంది, నిషేధం విధించబడింది, హిందూ మహాసభ దానిని వ్యతిరేకిస్తుంది 🌸🙏🌸 స్వామి చక్రపాణి మహారాజ్, జాతీయ అధ్యక్షుడు, అఖిల భారత హిందూ మహాసభ
Advertisement

తాజా వార్తలు

Advertisement