Saturday, November 23, 2024

Political Review – ఓరుగ‌ల్లు … పోరుగ‌ల్లు …..గెలిపెవ‌రిది

ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లు… రాణి రుద్రమ పౌరుషం.. సమ్మక్క-సారలమ్మ ఆత్మగౌరవ పోరాటం.. కాళోజీ, దాశరధి, పోతనల సాంస్కృతిక వారసత్వం.. వరంగల్‌ ప్రజల సొంతం. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎన్నో రాజకీయ మార్పులకు కేంద్ర బిందువుగా మారింది. పీవీ, రామసహాయం సురేందర్‌రెడ్డి, ఇట్యాల మధుసూదన్‌రావు, మద్దికాయల ఓంకార్‌ లాంటి ఎంతో రాజకీయ ఉద్దండులకు ప్రాతినిధ్యం కలిపించింది.. అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కడుతూ కంచుకోటలను బద్దలు కొట్టారు. ప్రజలను విస్మరించిన మహామహులను మట్టి కరిపి స్తామని విలక్షణమైన తీర్పునిచ్చారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలు ఎవరి పక్షం ఉంటారు… ఎవరిని ఆదరిస్తారు.. ఎలాంటి తీర్పును ఇవ్వబోతున్నారని యావత్‌ తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 అసెంబ్లిd నియోజకవర్గాలు ఉన్నాయి. ములుగు మినహా మిగిలిన 11 నియోజక వర్గాల్లో బీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యమే ఉన్నది. అయితే 2018 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్దిగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సారి ఎన్నికల్లో 12 స్థానాలకు 12 స్థానాలు గెలుచుకొని వరంగల్‌ గడ్డ… బీఆర్‌ఎస్‌ అడ్డా అని చాటి చెప్పాలని గట్టి పట్టుదలతో గులాబీ నాయకత్వం ముందుకు పోతున్నది. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న వరంగల్‌ను తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్‌ నాయకత్వం ఉవ్విళ్ళూరుతోంది…

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో :

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో గురు, శిష్యులను టార్గెట్‌ చేయ బోతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీతక్క గురు, శిష్యులుగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ఫోకస్‌ పెట్టింది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా దయాకర్‌రావును ఓడి స్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో సవాల్‌ చేశారు. ఇది లా ఉంటే ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్‌ పార్టీ ప్రాతి నిధ్యం వహిస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడగొట్టి కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం లేకుండా చేస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు సవాల్‌ చేశారు. ములుగు వేదికగా ఇటీవల జరిగిన బహిరంగ సభలో ఇద్దరు మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ సీతక్కను 32 వేల ఓట్ల మెజార్టీతో ఓడిస్తామని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ అధ్యక్షులు కేటిఆర్‌కు వాగ్ధానం చేశారు.

విలక్షణ తీర్పులు ఓరుగల్లు ప్రజల సొంతం
ఓరుగల్లు ప్రజలు ఎన్నికల్లో విలక్షణమైన తీర్పును ఇస్తుం టారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిభింబించే విధంగా స్పష ్టమైన తీర్పును ఇవ్వడం పరిపాటిగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో యావత్‌ దేశం తెలంగాణ పరిణామాలపై దృష్టి సారించగా, తెలంగాణ ఆకాంక్షను బలంగా చాటిచెప్పే విధంగా 2010, 2012లో జరిగినటువంటి ఉపఎన్నికల్లో
కాంగ్రెస్‌, టీడీపీలను ఓడించి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌ నుంచి రాజీనామాచేసి వచ్చిన తాటి కొండ రాజయ్యను అక్కున చేర్చుకున్నారు. పరకాల, వరంగల్‌ తూర్పులో కూడా ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించి టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. నర్సంపేటలో ఓటమి ఎరుగని నాయకుడిగా వరుస విజయాలతో వస్తున్న కమ్యూనిస్టు దిగ్గజం మద్దికాయల ఓంకా ర్‌ను అభివృద్ధి, సంక్షే మంకోసం ఓడించి రేవూరి ప్రకాష్‌రెడ్డిని గెలిపించారు. ఒక్కప్పుడు భూమికోసం, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాటాలు చేసిన కమ్యూనిస్టులను ఆదరించిన ఓరు గల్లు ప్రజలు ఇప్పుడు పక్కన పెట్టి అభివృద్ధికి పట్టం కడుతున్నారు.

వరంగల్‌ తూర్పు నియోజకవర్గం…
వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో నన్నపునేని నరేందర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహి స్తున్నారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్దిపై ఇంకా గులాబీ నాయకత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల జరిగిన కేటీఆర్‌ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వాదంతో నరేందర్‌ భారీ మెజార్టీతో గెలిచి రావాలంటూ కేటీఆర్‌ అంటూ పరోక్షంగా తూర్పునుంచి నన్నపునేని నరేందర్‌ అభ్యర్ధి అనే సంకె తాలు ఇచ్చారు. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మూ డు పార్టీల నుంచి బలమైన అభ్యర్ధులే బరిలో నిలువ బోతున్నారు. కాంగ్రెస్‌ నుంచి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అభ్యర్థులుగా ఉండ బోతున్నారు. త్రిముఖ పోటీలో బిఆర్‌ఎస్‌ అభ్యర్ది నరేందర్‌ బయటపడవచ్చనే అభిప్రా యాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

వర్దన్నపేటలో ఎదురులేని ఆరూరి రమేష్‌
2014, 2018 ఎ న్నికల్లో రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద మెజా ర్టీతో విజయం సాధించి తనకు ఎదురు లేదని నిరూపించుకుం టు న్నారు వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌. మూడో సారి హ్యాట్రిక్‌ విజయం కొట్టాలని గట్టి పట్టుదలతో ముందుకు పోతున్నారు. వర్దన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీజేపీ నుంచి బలమైన నాయకులు లేకపోవడం ఆరూరి రమేష్‌ కు కలిసి వస్తున్నది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, కాంగ్రెస్‌ నుంచి నమిండ్ల శ్రీనివాస్‌ లేదా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య బరిలో నిలి చే అవ కాశం ఉన్నది. ప్రత్య ర్దులు ఎవరైనా సరే ఆరూరి రమేష్‌ను ఢీ కొట్ట డం అంత సులు వు కాద ని రాజకీయ విశ్లేషకులు భావి స్తున్నారు.

పరకాల నియోజకవర్గం…
పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హ్యాట్రిక్‌ విజయం కోసం ఎదురు చూస్తు న్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మారెడ్డి 2016లో ఎర్రబెల్లి దయాకర్‌ాంవుతో పాటు టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బలమైన అభ్యర్దిగా చెప్పుకునే కొండా సురేఖపై విజయం సా ధించారు. బీజేపీ అభ్యర్ధి నామ మాత్రపు పోటీని ఇచ్చారు. ఈసారికూడా కాంగ్రెస్‌ నుంచి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి లేదా కొండా ముర ళీధర్‌రావు బరిలో నిలిచే అవకాశం ఉన్నది. బీజేపీ నుంచి డాక్టర్‌ పెసరు విజయ్‌చ ందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, డాక్టర్‌ కాళీప్రసాద్‌రావు బరిలో నిలిచే అవకాశం ఉంది. త్రిముఖ పోటీలో చల్లా ధర్మారెడ్డి గెలుస్తారనే ప్రచారం జరుగుతున్నది.

నర్సంపేట నియోజకవర్గం…
నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్‌రెడ్డిగా ఎమ్మెల్యే ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. అభివృద్ధి పరంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ నియోజ కవ ర్గంలో కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పోటీకి సిద్దమయ్యారు. బీజేపీ నుంచి మరో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకా ష్‌రెడ్డి బరిలో ఉంటున్నారు. త్రిముఖ పోటీలో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పెద్ది సుదర్శన్‌రెడ్డి గెలుపు అవకాశాలు ఉంటాయని రాజకీయ వర్గా లు భావిస్తున్నాయి.

ములుగులో తిరుగులేని ఐరన్‌ లేడి సీతక్క
2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోనే బలమైన నాయకు రాలిగా ఎదిగారు దనసరి అనసూయ అలియాస్‌ సీతక్క. కరోనా సమయంలో పేద ప్రజలకు ఇప్పటి వరకు అధికారులు కూడా పోన టువంటి మారుమూల గ్రామాలకు వెళ్లి నిత్యావ సరాలను స్వ యంగా మోసుకెళ్లి యావత్‌ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన సీతక్క ఐరన్‌లేడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాహుల్‌గాంధీ చేపట్టి నటువంటి భారత్‌ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు పలు రాష్ట్రాల్లో రాహుల్‌గాంధీతో కలిసి పాదయాత్ర చేసి కాం గ్రెస్‌ అగ్రనాయకత్వంలో కూడా సీతక్క గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ములుగు విషయానికి వస్తే చందులాల్‌ అకస్మిక మరణం తర్వా త సీతక్కపై పోటీ చేసే బలమైన నాయకుడు లేకపోవడం సీతక్కకు కలిసి వచ్చే అంశం. బీఆర్‌ఎస్‌ నాయకత్వం కూడా సీతక్కపై ఆది వాసీ మహిళనే బరిలో నిలుపాలని జెడ్పీచైర్‌పర్సన్‌ బడే నాగ జ్యో తిని సిద్దం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ న ుంచి మరో ముగ్గురు నేతలు టికెట్‌ ఆశిస్తున్నప్పటికీ…అధిష్టానం నాగజ్యోతి వైపే మొగ్గు చూపు తుంది. బీజెపి నుంచి నలుగురు నేతలు పోటీ పడుతున్నప్ప టికీ…ఎవరనెది స్పష్టత లేదు. దీంతో ములుగు నియోజక వర్గంలో సీత క్కకు తిరుగులేదనే పలు సర్వేలు చెబుతున్నాయి.

భూపాలపల్లి నియోజకవ ర్గం…
భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొంది నియోజకవర్గ అభివృద్ది కోసం బీఆర్‌ఎస్‌లో చేరా రు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ తొలి స్పీకర్‌గా ఉన్న సిిం కొండ మధుసూదనాచారి తనకే టికెట్‌ అంటూ నియోజక వర్గం లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ రెండు వర్గాలుగా ఏర్ప డ్డాయి. అయితే నాలుగు నెలల క్రితం భూపాలపల్లిలో జరిగిన కేటీఆర్‌ పర్యటనలో భూపాలపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్ది గండ్ర వెంకట రమణారెడ్డి అని తేల్చి చెప్పడంతో తనకున్న అడ్డంకులు తొలిగి పోయి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌ నుంచి గతంలో టీడీపీ, బీజేపీ, ఆల్‌ ఇండియా ఫార్వడ్‌ బ్లాక్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలో నిలువబోతున్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి పోటీ పడుతున్నారు. భూపాలపల్లిలో పోటీ ఆసక్తికరంగా మారబోతున్నది. త్రిముఖ పోటీ అయిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య హోరాహోరీగా మారబోతున్నది. ఎవ రు గెలిచిన కొద్ది తేడాతోనే గెలుస్తారని రాజకీయ పరిశీలకులు అభి ప్రాయ పడుతున్నారు.

జనగామ నియోజ కవర్గం…
జనగామ నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు అందుకున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మూడో సారి ఎమ్మెల్యేగా పోటీచేయాలనే గట్టీ పట్టుదలతో ఉన్నారు. ముతి ్తరెడ్డి యాదగిరిరెడ్డికి భూకబ్జాలు, అనేక అవి నీ తి అరోపణలు ఎదు ర్కొంటున్నారు. అంతేకాకుండా అధికారుల పట్ల దురుసు ప్రవర్తన కూడా యాదగిరి రెడ్డికి ప్రమాదంగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని బరిలో నిలుపాలని యోచిస్తున్నట్లు సమాచారం. కాం గ్రెస్‌ నుంచి మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మె ల్యే కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, మరో నాయకుడు ముక్కెర తిరు పతిరెడ్డి పోటీ పడుతున్నారు. జనగామలో త్రిముఖ పోటీ ఆసక్తి కరంగా ఉండబోతున్నది.

డోర్నకల్‌ నియోజకవర్గం….
డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి డీఎస్‌ రెడ్యానాయక్‌ ఎమ్మె ల్యేగా ప్రాతిని ధ్యం వహిస్తున్నారు. 2014 ఎ న్నికల్లో కాం గ్రెస్‌ నుంచి గెలుపొందిన రెడ్యానాయక్‌ తన కూతురు మాలోత్‌ కవితతో కలిసి 2016లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి నిలబడి రెడ్యానాయక్‌ గెలుపొందారు. వయస్సు మీద పడటంతో ఈసారి రెడ్యానాయక్‌ స్థానంలో ఆయన కూతురు ఎంపీ కవితను నిలుపాలని గులాబీ అధిష్టానం యోచి స్తోంది. అయితే రెడ్యానాయక్‌ కొడుకు రవిచంద్ర తనకు అవకాశం కల్పించాలని, కానిపక్షంలో తన తండ్రినే నిలుపాలని పట్టుపడు తు న్నారు. అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. కాం గ్రెస్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్‌ రామ్‌ చంద్రునాయక్‌ ఈ సారి కూడా ఆయననే కాంగ్రెస్‌ నిలబెడుతోంది. బీజేపీ నుంచి లక్ష్మణ్‌నాయక్‌ లేదా మరో నాయకులు పోటీ పడు తు న్నారు. పోటీ మాత్రం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరి జరగ బోతున్నది. కాంగ్రెస్‌ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి ఈ నియో జకవర్గానికి చెందిన వారే కావడంతో ఖమ్మం జిల్లా పొంగులేటి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈసారి ఎ న్నికల్లో కాంగ్రెస్‌కే అను కూలంగా ఉంటుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వ ్యక్తమవుతున్నాయి.

వ‌రంగ‌ల్ ప‌శ్చిమం
వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ వరుసగా నాలుగు సార్లు విజయం సాధిం చారు. ఐదవ సారి బరిలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే బీఆర్‌ఎస్‌లో వినయ్‌భాస్కర్‌కు పోటీ లేకపో వడం కలిసి వచ్చే అంశం. 2014, 2018 ఎన్నికల్లో క ూడా కాంగ్రెస్‌, బీజేపీ నుంచి బలమైన ప్రత్యర్ధి లేకపోవడం మరో కలిసి వచ్చే అం శంగా చెప్పుకోవచ్చు. వినయ్‌భాస్కర్‌పై వ్యతిరేకత ఉన్న ప్పటికీ….సరైన పోటీ లేకపోవడమే కలిసి వస్తోంది. అయితే ఈసారి కాంగ్రెస్‌, బీజేపీ కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి ఇద్దరు పోటీప డు తున్నారు. రాఘవరెడ్డికి టికెట్‌ ఖరారు చేసినట్లయితే వినయ్‌ భాస్కర్‌కు గట్టీ పోటీ ఉంటుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నుంచి రావు పద్మ, మాజీ ఎమ్మె ల్యే మార్తినేని ధర్మారావు, ఏనుగుల రాకేష్‌రెడ్డి పోటీ పడుతున్నారు. పశ్చిమలో పోటీ రసవత్తరంగా జరగనున్నది.

పాలకుర్తిలో ఎదురులేని ఎర్రబెల్లి …
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పాలకుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పంచా యతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు ఎదురులేదు. ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒక్కసారిగా ఎంపీగా వరుస విజయాలు అందుకున్న దయా కర్‌రావు పాలకుర్తి నుంచి ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్‌ సాధిం చేందుకు వ్యూహాలు సిద్ధం చేశారు. దయా కర్‌ రావును టార్గెట్‌ చేసుకొని కాం గ్రె స్‌ పార్టీ పావులు కదుపుతున్నది. ఎన్నారై ఝాన్సీరెడ్డిని దయాకర్‌రావుపై బరిలో దింపేందుకు సిద్దం చేశారు. ఇప్పటికే తొర్రూర్‌లో ఓటు హక్కు దరఖాస్తు చేసుకొని అమెరికాలో ఉన్న తన పౌరసత్వాన్ని రద్దు చేసు కునేం దుకు ఏర్పా టుచేసుకుని పోటీకి సిద్దమైంది. ఒకవేళ ఝాన్సీ రె డ్డికి అమెరికా పౌర సత్వం అడ్డువచ్చినట్లయితే రాజకీయ దురం ధరు డు రామ సహా యం సురేందర్‌రెడ్డి కొడుకు రఘు రామ్‌రెడ్డిని బరి లోకి దింపాలనే యోచన కూడా చేస్తున్నారు. బీజేపీ నుంచి పెద గాని సోమయ్యను బరిలో నిలుపుతున్నారు. ప్రధాన పోటీ బీఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌ల మ ధ్యన సాగనున్నది. కెసీఆర్‌ నాయ క త్వంలో జరిగినటువంటి అభి వృద్ది, సంక్షేమ పథకాలు దయాకర్‌ రా వుకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్‌ పాలకుర్తి నుంచి హ్యాట్రిక్‌ విజ యాన్ని అందిస్తా రనే ధీమాలో ఉన్నారు.
మహబూబాబాద్‌…
మహబూబాబాద్‌ నియోజకవర్గంలో బానోత్‌ శంకర్‌నాయక్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు అందుకున్న శంకర్‌నాయక్‌ మూడోసారి బరిలో నిలిచి హ్యాట్రిక్‌ సాధించాలనే ఆశతో ఉన్నారు. శంకర్‌నాయక్‌పై భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు, అనేక ఆరోపణలు ఉండటంతో ఈ సారి టికెట్‌ మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. శంకర్‌ నాయక్‌ స్థానంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత లేదా రాష్ట్ర గిిం జన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను బరిలో నిలుపాలని యోచిస్తున్నది. కాంగ్రెస్‌ నుంచి కేంద్రమాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌, కాంగ్రెస్‌ గిరిజన విభా గం రాష్ట్ర అధ్యక్షులు తేజావత్‌ బెల్లయ్యనాయక్‌, మున్సిపాలిటి మా జీ చైర్మన్‌ ఉమ భర్త డాక్టర్‌ మురళీనాయక్‌ పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ బరిలో నిలువ బోతున్నారు. అయితే ఈ నియోజకవర్గం పై కాంగ్రెస్‌ దిగ్గజం రామసహాయం సురేందర్‌రెడ్డి, ఖమ్మం నుంచి కాంగ్రెస్‌లో చేరబోతున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉంటుందనే ప్రచారం జరుగు తోంది.

స్టేషన్‌ఘన్‌పూర్‌ ని యోజకవర్గం…
స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుం చి డాక్ట ర్‌ తాటికొండ ంాజయ్య ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి గెలి చిన తాటికొండ రాజయ్య, 2011లో కాంగ్రెస్‌ పార్టీ కి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ లో చేరి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014- 2018 ఎ న్నికల్లో వరుస విజయాలు అందు కున్న డాక్టర్‌ రాజయ్య నియోజ కవర్గంలో ఎన్నడూ లేని వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అవి నీతితోపాటు మహిళల పట్ల అనుచిత ప్రవర్తనే రాజయ్య మెడకు ఉచ్చు చుట్టుకోబోతున్నది. ఇదే నియోజకవర్గంలో గతంలో టీడీపీ హయాంలో రెండు సార్లు మంత్రిగా, తెలంగాణ వచ్చిన తర్వాత ఉపముఖ్యమంత్రిగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కడి యం శ్రీహరి వర్గానికి రాజయ్య వర్గానికి మధ్య విభేదాలు తారా స్థాయికి వచ్చాయి. ఇద్ద ంి మధ్య మూడో వ్యక్తికి సందు అన్నట్లుగా, ఇద్దరు మధ్య విభేదాలు ఇలాగే ఉంటే కాంగ్రెస్‌ అభ్యర్దిగా బరిలో నిలువబోతున్న సింగ పురం ఇందిరా గెలుస్తుందనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఈ నియోజకవర్గం నంచి బీజేపీ తరపున మాజీ మంత్రి డాక్టర్‌ గుండే విజయరామారావు బరిలో ని లువబోతున్నారు. త్రిముఖ పోటీ హోరాహోరిగా ఉండబోతున్నది. స్టేషన్‌ఘన్‌ పూర్‌ నుంచి కడియం శ్రీహరిని బరిలో నిలిపినట్లియతే బిఆర్‌ఎస్‌కు విజయం లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దూకుడు పెంచిన కాంగ్రెస్‌..
కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. కర్ణా టక ఫలితాలకు ముందు కాంగ్రెస్‌కు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ములుగు నియోజకవర్గం ఒకటే గ్యారంటీగా గెలిచే సీటుగా ఉండేది. కానీ మారుతున్న సమీకరణాలు మరో నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. 12 నియోజక వర్గా ల్లో 8 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, 4 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలు ఉన్నాయని మారుతున్న రాజకీయ సమీకరణాలు స్పష్టం చేస్తు న్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాలపై రామసహాయం సురేందర్‌రెడ్డి ప్రభావం ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. మహబూబాబాద్‌ , డోర్నకల్‌ నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement