Wednesday, November 20, 2024

Political Heat – 29న అమిత్ షా రాక‌.. గెలుపు కోసం నేత‌ల‌కు దిశ నిర్దేశం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: భారతీయ జనతాపార్టీ అగ్రనేత, కేంద్రహోం, సహకార శాఖ మంత్రి అమిత్‌ షా ఈ శనివారం హైదరాబాద్‌ వస్తున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ రానున్న అమిత్‌ షా ఆరోజు బిజీ బిజీగా గడపనున్నారు. పార్టీ కొర్‌ కమిటీ- భేటీ- తో సహా జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎన్నికల నిర్వహణ కమిటీ-, మేని ఫెస్టో కమిటీ-, పార్టీలో చేరికలు, ఎన్నికల్లో గెలిచేందుకు ఏ విధంగా ముందు కెళ్లాలన్న అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. భారాస వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్లి ఎలా ఎండగట్టాలన్న అంశంపై అయన నేతలకు దిశా నిర్దేశం చేస్తారు. తన హైదరాబాద్‌ పర్యటన సందర్బంగా కొంతమంది సినీ,రాజకీయ,ఆర్ధికరంగ ప్రముఖు లతో పాటు ఆయా రంగాల్లో ముఖ్యులను కలిసే అవకాశం ఉన్నట్టు- సమాచారం. అమిత్‌ షా సమక్షంలో భారాస కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు,ఎంపీ లు ఆయా జిల్లాలు, అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ముఖ్య నేతలు అమిత షా ను కలిసి భాజపా లో చేరుతున్నట్టు- ప్రకటిస్తారని వీలైతే అక్కడికక్కడే పార్టీ కండువాలు కప్పి భాజపా లోకి ఆహ్వానించే అవకాశం లేక పోలేదని చెబుతున్నారు. అమిత్‌ షా తన పర్యటన సందర్బంగా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, నాయకత్వ మార్పు తర్వాత ఉత్పన్నమైన ఘటనలు, పరిస్థితులపై అరా తీసి హెచ్చరికలు జారీ చేయనున్నట్టు- సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాల్సిందేనని ఇందుకు పార్టీ జాతీయ నాయకత్వం పూర్తి అండగా ఉంటు-ందన్న భరోసా ఇవ్వనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం దృష్టి సారించిందని సరైన సమయంలో తగు నిర్ణయాలుంటాయని అమిత్‌ షా చెప్పే అవకాశం ఉంది. భాజపా కొత్త రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తొలి సారి తెలంగాణకు వస్తోన్న అమిత్‌ షా ఎన్నికలకు సంబంధించి కీలక చర్చలు జరపడంతో పాటు- కఠిన,కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు.

తెలంగాణలో పట్టు- సాధించాలి.. గెలవాల్సిందే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావాలన్న పట్టు-దలతో ఉంది. ఈ దిశగా పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్‌ షా తెలంగాణ పర్యటనపై పార్టీ లో ఆసక్తి నెలకొంది. ఈ నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించారు. ప్రధాని పర్యటన ముగిసిన మరుసటి రోజే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్‌ వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్ర పార్టీ నేతలతో నడ్డా సమావేశమయ్యారు. దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఖమ్మంలో భాజపా ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించా లని నిర్ణయించారు. అయితే మణిపూర్‌ అల్లర్ల నేపథ్యంలో అమిత్‌ షా పర్యటన వాయిదా పడింది. దీంతో ఖమ్మం సభ రద్దయింది. అయితే అమిత్‌ షా 29న హైదరాబాద్‌ పర్యటన పార్టీ సంస్థాగత అంశాలకే పరిమితం కానుందని పార్టీ వర్గాలంటు-న్నా యి. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపై నే అమిత్‌ షా నేతలతో చర్చించనున్నారు. పార్టీ నేతలతో సంస్థా గత అంశాలపై అమిత్‌ షా చర్చించనున్నట్టు- పార్టీ వర్గాలంటు-న్నాయి. పార్టీలోని వివిధ వర్గాల సీనియర్లతో అమిత్‌ షా సమావేశం కానున్నారు. బీజేపీ కోర్‌ కమిటీ- సమావేశం ఈ నెల 26న జరగనుంది. ఈ సమావేశంలో ఎన్నికల కమిటీ-లను ఖరారు చేయనున్నారు. ఈ కమిటీ-లతో అమిత్‌ షా సమావేశం కానున్నారు.

ఎన్నికల వ్యూహంపై బండితో చర్చించిన షా
తెలంగాణలో ఎన్నికల వ్యూహాలపై అమిత్‌ షా, బండి సంజయ్‌ మధ్య చర్చ జరిగినట్లు- సమాచారం. సోమవారం పార్లమెంటు- ఆవరణలో కరీంనగర్‌ ఎంపీ భాజపా పూర్వ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ కేంద్ర మంత్రి అమిత షా తో భేటీ- అయ్యారు. పావు గంట కు పైగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.జాతీయ రాజకీయాల్లో చాణక్య వంటి అమిత్‌ షాతో సమావేశం కావడం ఉత్సహాన్నీ ఇచ్చిందని బండి సంజయ్‌ షాతో జరిగిన భేటీ తర్వాత ట్వీట్‌ చేశారు. షా మార్గదర్శకత్వంలో బీజేపీని తెలంగాణలో అధికారం లోకి తీసుకురావడానికి కృషి చేస్తా నని తెలిపారు. అమిత్‌ షాను బండి సంజయ్‌ కలవడంపై బీజేపీలో ఆసక్తికర మైన చర్చ జరుగుతోంది
కాగా.. తెలంగాణలోని పరిస్థితులపై బండి సంజయ్‌ తో చర్చించానని అమిత్‌ షా చెప్పారు. బాగా పని చేయాలని, తాను అండగా ఉంటానని బండి సంజయ్‌ కి అమిత్‌ షా భరోసా ఇచ్చారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. ఇప్పటికీ బండి సంజయ్‌ పై బాధ్యత ఉందని, బీజేపీ క్యాడర్‌ లో ఉత్సాహం నింపాలని అన్నట్లు- తెలిసింది. దూకుడుగానే ముందుకు వెళ్లాలని చెప్పారు. కాగా తన వర్గం వారిని భాజపా లో ఇబ్బంది పెదుతున్నారని సంజయ్‌ ఫిర్యాదు చేసినట్టు- సమాచారం.

సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రి , భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అమిత్‌ షాను కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలను ఆయన అమిత్‌ షాకు వివరించారు. శనివారం హైదరాబాద్‌ పర్యటనకు సంబంధించిన అంశాలను కూడా ఇరువురు చర్చించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement