పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం మొదలైంది. పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దింపేందుకు అక్కడి విపక్షాలన్నీ ఏకమవుతున్నయ్. ఎట్టి స్థితిలో ప్రజాకంటక ప్రధాని ఉండటానికి వీళ్లేందంటున్నాయి విపక్షాలు. ఇమ్రాన్ సర్కారుపై పార్లమెంట్లో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు విపక్ష నేతలు. ఈ తీర్మానంపై వంద మంది సభ్యులు సంతకాలు చేయడంతో సర్కారు గద్దె దిగడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, ఈ తీర్మానంపై మరో వారం రోజుల్లోగా పార్లమెంట్ సమవేశపర్చాల్సి ఉంది.
342 మంది సభ్యులున్న సభలో 172 మంది సభ్యులు ఆమోదం తెలిపితే ఇమ్రాన్ ఖాన్ సర్కారు కూలిపోవడం ఖాయం. గత ఏడాది విశ్వాస తీర్మానం నెగ్గించుకున్నా.. ఆరుగురు సభ్యులు మాత్రమే అదనంగా మద్దతివ్వడంతో ఈసారి ఏమైపోతుందన్న బెంగ ఇమ్రాన్ ఖాన్ లో వ్యక్తమవుతోంది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం ముందుండి ఈ మొత్తం రాజకీయం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.