Sunday, November 17, 2024

పోలియో రహిత సమాజం ఆవిష్కృతం కావాలి – ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్

శ్రీకాకుళం : పోలియో రహిత సమాజం ఆవిష్కృతం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సార్వత్రిక పల్స్ పోలియో కార్యక్రమాన్ని పోలాకి మండలం మబుగాంలో ఉప ముఖ్యమంత్రి ప్రారంభించగా, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడు పేటలోను, శ్రీకాకుళం లయన్స్ కార్యాలయం ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ద వహించాలని పిలుపు నిచ్చారు. పోలియో మహమ్మారి భారీన పడితే.. జీవితాంతం మానసికంగా కొంత ఆవేదన ఉంటుందని తల్లిదండ్రులు గ్రహించాలని సూచించారు. చిన్నారులను చక్కగా పెంచి.. ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడం ధ్యేయంగా ఉండాలని పేర్కొన్నారు. తద్వారా ఆరోగ్య వంతమైన సమాజం ఏర్పడుతుందని భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. జిల్లాలో 0-5 సంవ‌త్స‌రాల వ‌య‌సు క‌లిగిన 2,33,683 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు మొత్తం 2,88,000 డోసులు సిద్ధం చేశామ‌ని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉద‌‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంటల వ‌ర‌కు చుక్కలు వేసి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని వివరించారు. జిల్లాలో 1634 బూత్‌ల ద్వారా చుక్కలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. టీకాల పంపిణీలో మొత్తం 1634 బృందాలు పాల్గొంటున్నాయ‌‌ని ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త తీసుకున్నామ‌ని తెలిపారు. 98 మొబైల్‌, 50 ట్రాన్సిట్ బృందాలు ఉన్నాయ‌ని వివ‌రించారు.160 మంది సుపర్ వైజర్లు, 7,324 మంది సిబ్బంది సేవ‌ల్లో పాల్గొని పిల్ల‌ల‌కు చుక్కలు అంద‌జేస్తార‌న్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన బూత్‌ల‌లో చుక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఒక వేళ ఎక్క‌డైనా పిల్ల‌లు ఉండిపోతే ఫిబ్రవరి 28, మార్చి1 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తార‌ని స్ప‌ష్టం చేశారు

ప్ర‌యాణంలో ఉన్న‌ పిల్ల‌ల‌కు
ట్రాన్సిస్ట్ బృందాలు ప్ర‌యాణించే బ‌స్సుల్లో కూడా పిల్ల‌ల‌కు టీకాలు అంద‌జేస్తాయ‌ని వివ‌రించారు. జిల్లా న‌లుమూల‌లా వివిధ ప్రాంతాల్లో.. అలాగే జిల్లా స‌రిహ‌ద్దుల్లో కూడా ప్ర‌త్యేక బృందాల‌ను నియ‌మించామ‌ని.. ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా కార్య‌క్ర‌మాన్ని అంద‌రి స‌మ‌న్వ‌యంతో నిర్వ‌హిస్తామ‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.జగన్నాథ రావు, జిల్లా ఇమ్యూనేజేషన్ అధికారి డాక్టర్ ఆర్.వి.యస్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బి. దేవభూషన్ రావు, నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement