హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాఫిక్ రూల్స్‌ని చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నారు. వాహనదారులు ఏ చిన్న పొరపాటు చేసినా చలాన్లు విధిస్తున్నారు. ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర జీబ్రా లైన్ క్రాస్ చేసినా.. ఆరెంజ్ లైట్ ఉన్నప్పుడు క్రాస్ చేసినా కూడా కొంతమందికి చలాన్లు విధిస్తున్నారు.. అంతేకాకుండా పిలియన్ (బైక్ వెనకాల కూర్చున్న వారు) రైడర్ కూడా హెల్మట్ పెట్టుకోవాలన్న రూల్‌ని చాలా సీరియస్‌గా అమలు చేస్తున్నారు. ఇవన్నీ అభినందనీయమే..
అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది పోలీసులు చేస్తున్న అతి… వారి వ్యవహార ధోరణితో మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. నడిరోడ్డుమీద ఆపేయడం.. బైక్, కారు కీస్ తీసుకుని పక్కకు తీసుకెళ్లడం.. వంటివి అపవాదు తెస్తున్నాయి.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఇవన్నీ అవరోధంగా మారుతున్నాయి..
ఈ క్రమంలో పోలీసులు కూడా చట్టానికి అతీతులు కాదనీ.. రూల్స్, రెగ్యులేషన్స్ కచ్చితంగా పాటించాలని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వారి సిబ్బందికి పలుమార్లు సూచిస్తూ.. ఒక్కోసారి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు..
కానీ, కొంతమంది ఖాకీ డ్రెస్ వేసుకున్నాం.. పోలీసు డ్యూటీలోనే ఉన్నాం.. తమను ఎవరూ పట్టించుకోరు.. అనే రీతిలో వ్యవహరిస్తుండడం కూడా పోలీసు వ్యవస్థకు.. అందరు పోలీసులకు చెడ్డపేరు తీసుకొస్తుంది.. ఈ క్రమంలో శనివారం (13-11-21) నాడు చాంద్రాయణ గుట్టలో ఓ పోలీసు అధికారి హెల్మట్ పెట్టుకోకుండానే బైక్‌పై వెళ్తుండడం ప్రజా పోలీసులు (పీపుల్స్) గమనించారు. ఇది రూల్స్‌కు విరుద్ధమే కదా అని ఆ ఫొటోని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.