Friday, November 22, 2024

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎంకు పోలీసుల స‌మ‌న్లు

బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర సింగ్‌ ఫడ్నవీస్‌కు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరై వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న సమయంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌పై నమోదైన కేసులో ఫడ్నవీస్ సాక్షి అని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఫడ్నవీస్ ఒక సాక్షి అని, గతంలో ఆయన వాంగ్మూలం రికార్డు చేసినట్లు రాష్ట్రం తరఫున హాజరైన స్పెషల్‌ ప్రాసిక్యూటర్ అజయ్‌ మిసార్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం ఫైర్‌ అయ్యారు. కేసును నీరుగార్చాలని చూస్తుందని, స్కామ్‌స్టర్‌లను కాపాడాలనుకుంటోందని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement