వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసు విచారణకు హాజరయ్యాడు హీరో సిద్ధార్థ్. మరోసారి బ్యాండ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కి క్షమాపణలు చెప్పాడు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సైనాకు గతంలోనే సారీ చెప్పాడు సిద్ధార్ధ్. రీసెంట్ గా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పంజాబ్ టూర్ లో భద్రతా వైఫల్యం వలన ఇబ్బంది పడ్డారు. దీనిపై దేశమంతా చర్చ సాగుతున్న వేళ. ఈ విషయం గురించి సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. దాంతోహీరో సిద్ధార్థ్ సైనా ట్వీట్ పై వివాదాస్పద రీతిలో స్పందించాడు. ట్వీట్లో సిద్ధార్థ్ ఉపయోగించిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉండడంతో దేశమంతా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సిద్ధార్థ్ పై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు పోలీసులను ఆదేశించింది. నిరసనలు తీవ్రం అవ్వడంతో సిద్ధార్థ్ వెంటనే సైనాకు క్షమాపణలు చెబుతూ ట్విట్టర్లో లెటర్ పోస్ట్ చేశాడు.ఇది ఇలా ఉండగా.. మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు వారి దర్యాప్తులో భాగంగా సిద్ధార్థ్ కు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందడంలో విచారణలో.. భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసుల ఎదుట హాజరైన సిద్ధార్థ్ .. సైనాపై తాను చేసిన వ్యాఖ్యల వెనక ఎలాంటి చెడు ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..