Sunday, November 24, 2024

Big Breaking | 1.5 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు.. సీజ్​ చేసిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో ఇవ్వాల (సోమవారం) పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. పోలీసులు వాటిని సీజ్​ చేశారు. 33 బ్యాగులలో 1.5 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు.

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి రాయికల్ చౌరస్తావద్ద 1.5 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు వెళ్తున్న తోటకూర రంగారావుని అరెస్ట్ చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు వాసిగా గుర్తించారు. నిందితుడు గతంలో ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు విక్రయించి జైలుకు వెళ్లినట్లు పోలీసుల తెలిపారు. 33 బ్యాగులలో, 1.5 టన్నుల నకిలీ పత్తి విత్తనాల స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్​కు తరలించినట్టు తెలిపారు. పట్టుబడ్డ నకిలీ విత్తనాల విలువ దాదాపు 40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.  

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement