Friday, November 22, 2024

డెలివరీ బాయ్స్ వాహనాలు సీజ్.. మరి ఆ జీవో ఎందుకు?

తెలంగాణలో లాక్ డౌన్ ను పోసలు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపై వచ్చే వారిపై కేసులు నమోదు చేసి వారి వాహనాల్ని కూడా సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జొమాటో, స్విగ్గి డెలివరీ బాయ్స్ వాహనాలను సైతం సీజ్ చేస్తున్నారు. ఈ కామర్స్ లో ఉన్న సేవలకు కూడా అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా తమను అపేస్తున్నారంటూ ఈ కామర్స్ డెలివరీ బాయ్స్ అవేదన వ్యక్తం చేస్తున్నారు. జొమాటో తమకు పెనాల్టీ వేస్తుందని, పోలీసుల ఫైన్‌తో నష్డపోతామని బాయ్స్ వాపోతున్నారు. నిత్యావసర వస్తువులు, ఈ కామర్స్ లో ఉన్న సేవలకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన జీవో నెం.102లో పేర్కొంది. అయినా పోలీసులు మాత్రం అనుమతి లేదంటూ డెలివరీ బాయ్స్ వాహనాలను అడ్డుకుంటున్నారు.

మరోవైపు, ‌డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు ఉన్న‌తాధికారుల‌కు కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కుంటి సాకులు చెప్పిన వారి వాహనాలు పోలీసులు సీజ్ చేస్తున్నారు. అంతేకాదు, సదరు వాహనాలను లాక్ డౌన్ ముగిసిన తర్వాతే ఇస్తామని స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 12 నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్‌ వేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించింది. 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉన్నా.. అత్యవసర వైద్యం కోసం వెళ్తున్న బాధితులు, వైద్యరంగంలో పనిచేసే వారి వాహనాలకు అనుమతి ఉంటుంది. నిత్యావసర వస్తువుల పాలు, కూరగాయలు, ఆహార సామగ్రి, డెయిరీ ప్రొడక్ట్స్‌ రవాణాకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అయినా, పోలీసులు ముందను జీవో లేకుండా జొమాటో, స్విగ్గి డెలివరీ బాయ్స్ వాహనాలను సైతం సీజ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement