ఎనిమిది కోట్ల విలువ చేసే హెరాయిన్ ను పోలీసులు సీజ్ చేశారు. ఇండో-మయన్మార్ సరిహద్దులోని మిజోరంలోని చంపాయ్ జిల్లాలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన సెర్చిప్ బెటాలియన్ సైనికులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 751.2 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.రికవరీ చేసిన హెరాయిన్ విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు. అలాగే.. ఐజ్వాల్‌కు సమీపంలో 107 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు మిజోరం నార్కోటిక్స్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.అంతకుముందు, మిజోరం ఎక్సైజ్ మరియు నార్కోటిక్స్ విభాగం నిర్వహించిన సోదాల్లో రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో నుండి రూ.14 లక్షల విలువైన 503 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది మరియు ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసింది. ఈ ఘటనలో నిందితుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement