Sunday, November 24, 2024

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి, ముగ్గురు అరెస్ట్.. వెస్ట్ బెంగాల్ నుండి మహిళలను రప్పిస్తూ ఆ పని!

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): ఓరుగల్లు కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను రప్పిస్తూ, గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహం గుట్టును వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. హన్మకొండ నడి బోడ్డున గల రెడ్డికాలనీలో ఈజీ ఎర్న్ కోసం, నయా స్కెచ్ వేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ టీమ్​కి పక్కా సమాచారం అందిందని ఏసీపీ ఎం. జితేందర్ రెడ్డి తెలిపారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ సూచనల మేరకు రెడ్డి కాలనీలోని ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను, ఇద్దరు విటులను టాస్క్ ఫోర్స్, హన్మకొండ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి అరెస్టు చేశారు.

టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎం. జితేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకు చెందిన ఒక మహిళ.. ఇల్లును కిరాయికి తీసుకొని ఇతర రాష్ట్రాల నుంచి(వెస్ట్ బెంగాల్) మహిళలను రప్పిస్తూ సంవత్సరం కాలంంగా వ్యబిచారం నిర్వహిస్తోంది. సులభంగా డబ్బులు సంపాదించాలని ఈ పనిచేస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో తేలిందన్నారు.పక్కా సమాచారం మేరకు దాడి చేసిన క్రమంలో మంగళవారం శాయంపేట జీవన్ నగర్ ఎస్సీ కాలనీ, చెందిన విటులు స్టీఫెన్​ మరిపెల్లి. పీటర్ తో పాటు, మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రైడ్ చేసి వెస్ట్ బెంగాల్ కు చెందిన ఇద్దరు బాధిత మహిళలను కాపాడినట్లు తెలిపారు. వ్యబిచార నిర్వాహకురాలు అయిన కుతాటి నందిని, మరిపెల్లి స్టేపెన్, మరిపెల్లి పీటర్ లను తదుపరి విచారణ నిమిత్తం హన్మకొండ పోలీసులకు అప్పగించారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ మాట్లాడుతూ ఎవరైనా ఆర్గనైజ్డ్ గా ఏర్పడి మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తే చట్టపరంగా, కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.వ్యభిచారమే వృత్తిగా చేసుకొని రూములు తీసుకొని పదే పదే దొరికిన నిర్వాహకులపై పీడీ యాక్ట్​ అమలు చేస్తామని తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement