Tuesday, November 26, 2024

లాటరీకి 3వేలు.. స్మగ్లింగ్ కేసులకు 20వేలు.. ఏకంగా సర్య్కులర్ జారీ చేసిన ఎస్పీ

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్టుంది ఆ పోలీసు ఆఫీసర్ తీరు. లాటరీకి రూ.3వేలు, స్మగ్లింగ్ కేసులకు రూ.20వేల లంచం ఇవ్వాలని ఏకంగా సర్య్కులరే జారీ చేశాడు.

అవును ఇది నిజమే.. కానీ, ఈ డబ్బులు వసూలు చేసేది లంచగొండి పోలీసుల నుంచి మాత్రమే. ఇది తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఎస్పీ తీసుకున్న నిర్ణయం. ఏ ఏరియాలో అక్రమంగా లాటరీ టిక్కెట్లు అమ్ముతున్నారో ఆ ఏరియా ఇన్ చార్జి నుంచి డబ్బులు వసూలు చేయాలని సర్య్కులర్ సారాంశం. అంతేకాకుండా అక్రమంగా ఇసుక తరలింపులకు కూడా రూ.20 వేలు ఇవ్వాలని రేట్ ఫిక్స్ చేశారు. పోలీసు నిబంధనల ఉల్లంఘన, అక్రమాలు, లంచం తీసుకునే ఘటనలకు ఇట్లాంటి ఫైన్ ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రజలకు పోలీసుల నుంచి వేధింపులు పెరుగుతున్నాయన్న ఆరోపణలతోనే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. లంచగొండి ఆఫీసర్ల బారి నుంచి డబ్బులు వసూలు చేయడం మంచి చర్యగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. ఆ ఎస్పీ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement