ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పేలుడు పదార్థాలు దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. దీంతో పోలీసులు, ఆలయ అధికారులు అప్రమత్తమైయ్యారు. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పెన్ ఘాట్ వంతెన కింద జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. అసలు ఇవి ఇక్కడకి.. ఎక్కడ నుంచి వచ్చాయనే అంశంపై విచారణ చేపట్టారు. ఎవరు తీసుకువచ్చారనే దానిపై విచారణ జరుగుతోంది. మొత్తంగా 6 జిలెటిన్ స్టిక్స్ లను స్వాధీనం చేసుకున్నారు. బాంబ్ స్వ్యాడ్ మొత్తం తనిఖీలు చేస్తున్నారు.
శబరిమల తిరువాభరణం ఊరేగింపు మార్గంలో ఆరు జిలెటిన్ స్టిక్‌లను పోలీసులు కనుగొన్నారు. బాంబు స్క్వాడ్ సాయంతో అయ్యప్ప ఆలయ మార్గంలో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు పేలుడు పదార్థాలను తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. శబరిమల నుండి తిరువాభరణం (అయ్యప్ప ఆభరణాలు) మోసుకెళ్ళే పెట్టె జనవరి 21 న తెల్లవారుజామున 4 గంటలకు ఈ రహదారిలో మాత్రమే తిరిగి పందళం చేరుకోవడానికి షెడ్యూల్ చేయబడింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..