ఢిల్లీలో భారీ కుట్ర పన్నారు ఉగ్రవాదులు. వార కుట్రని భగ్నం చేశారు పోలీసులు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఉగ్రవాదులు ఈ కుట్రకి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీమొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పట్‌పర్‌గంజ్ ప్రాంతంలో అరెస్టు చేసిన వారి నుంచి 2,251 (లైవ్ కాట్రిడ్జ్)తూటాలను స్వాధీనం తూర్పు ఢిల్లీ పోలీసులు చేసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు. తనిఖీల సమయంలో అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ పోలీసు కమిషనర్ విక్రంజిత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులు ఆ తూటాలను లక్నోకు తరలించేందుకు ప్లాన్ చేసినట్లు తేలిందన్నారు. ఈ కుట్రలో ఉగ్రవాదుల ప్రమేయం ఉండొచ్చనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోందన్నారు. ఆరుగురిలో ఒకరు డెహ్రాడూన్‌కు చెందిన వ్యక్తి అని, అతను గన్ హౌజ్‌కు ఓనర్ అని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement