Friday, November 22, 2024

Murder Solve: పోలీస్​ డాగ్​ రాంబో హెల్ప్​.. 24 గంటల్లో వీడిన వృద్ధుడి మర్డర్​ కేసు

కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలో జరిగిన ఓ మర్డర్​ కేసుని పోలీసులు 24 గంటల్లోగా ఛేదించారు. ఈ మర్డర్​ కేసును సాల్వ్​ చేయడంలో పోలీస్​ డాగ్ రాంబో ఎంతో నైపుణ్యం చూపిందని..  నిందితులను ట్రాక్​ చేయడంలో తమకు డాగ్​ స్మెల్​ ద్వారా పని ఈజీ అయ్యిందని బెంగళూరు పోలీస్​ కమిషనర్​ భాస్కర్​రావు తెలిపారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కర్నాటక రాష్ట్రం గడగ్‌లోని ప్రొఫెషనల్ కె-9 యూనిట్ మంగళవారం 60 ఏళ్ల వృద్ధుడి మర్డర్​ కేసును పోలీసు కుక్క ‘రాంబో’ సహాయంతో 24 గంటల్లో విజయవంతంగా ఛేదించింది. కర్నాటకలోని షిరట్టి తాలూకాలోని హోసల్లి గ్రామంలో వృద్ధుడి తలపై బండరాయితో కొట్టి చంపేశారు. జిల్లా క్రైమ్ యూనిట్ క్రైమ్ సీన్‌ను పరిశీలించి పలు వివరాలను సేకరించింది. అయితే.. K-9 యూనిట్ ఆధ్వర్యంలో ఉన్న ఓ సూపర్​ డాగ్​ రాంబోను ఈ కేసు ఛేదించేందుకు ఉపయోగించారు. 

కాగా, ఈ కేసులో కీలకమైన ఆధారాలు లభించిన నిందితుడి ఇంటిని రాంబో వెంటనే ట్రాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి జాప్యం లేకుండా హంతకులను ట్రాక్ చేసి అరెస్టు చేశారు. అక్టోబరు 24న శిరహట్టి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హోసహళ్లి గ్రామ సమీపంలో వృద్ధుడు శవమై కనిపించాడు. బాధితుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 24 గంటల్లో హత్యకేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసు కుక్క రాంబో, దాని నిర్వాహకులను సాయం కోరారు. బాధితుడికి ఇరుగుపొరుగు ఇండ్ల వారితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ బంధంపై ఆగ్రహించిన నిందితులు అతడిని బండరాయితో కొట్టి హత్య చేసినట్టు విచారణలో వెల్లడయ్యింది.

ఇక.. ఈ ఏడాది మే నెలలో కర్నాటక పోలీసులు వారి బలగాలను బలోపేతం చేసేందుకు రూ.2.5 కోట్ల వ్యయంతో దాదాపు 50 కుక్కలను పోలీసు డాగ్ స్క్వాడ్‌లో చేర్చుకున్నారు. పేలుడు పదార్థాలు, డ్రగ్స్ తోపాటు నేరాలను గుర్తించడంలో ఈ డాగ్‌ స్క్వాడ్‌ కీలక పాత్ర పోషిస్తుందని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావు తెలిపారు.

- Advertisement -

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కుక్కల బృందాన్ని బలోపేతం చేసేందుకు అన్ని పోలీసు డాగ్‌లకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మహిళా కానిస్టేబుళ్లను డాగ్ హ్యాండ్లర్లుగా నియమించాలని కర్నాటక పోలీసు శాఖ యోచిస్తోందని సీపీ భాస్కర్​రావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement