Monday, November 25, 2024

అమరుల‌ స్ఫూర్తితో.. మిగతా వారూ పనిచేయాలన్న‌ సీఎం కేసీఆర్

police commemoration: శాంతి భ‌ద్ర‌త‌ల‌ పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరులను ఎన్నటికీ మరువరాదని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆయన నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకున్నారు. అమరులైన పోలీసుల స్ఫూర్తితో మిగతా వారంతా విధి నిర్వహణలో పునరంకితం కావాల‌ని పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్‌ చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అమరుల త్యాగాలను స్మ‌రించుకుని నివాళుల‌ర్పించారు. హైదరాబాద్ లో హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి నివాళులర్పించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని మహమూద్ అలీ అన్నారు.

సర్కార్ చొరవతో పోలీస్ శాఖ పటిష్ఠమైందని డీజీపీ మహేందర్ రెడ్డి కొనియాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్ర‌భుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి సమయంలో పోలీసుల సేవలు మరువలేనివన్నారు. గంజాయి, గుట్కా లేకుండా చేస్తామ‌ని, అదేవిధంగా నేర రహిత తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement