సూర్యాపేట జిల్లాలో పోలీసులు వ్యవహారించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైభీమ్ సినిమా తరహాలో దొంగతనం కేసులో ఓ గిరిజనుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే… సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని రామోజీ తండాకు చెందిన గుగులోతు వీరశేఖర్ అనే గిరిజన యువకుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఎస్ఐ లింగం యాదవ్.. బాధితుడిని దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. తనకే పాపం తెలియదని చెప్పినా వినకుండా కాళ్లు కట్టేసి దారుణం హింసించారు. విచారణ అనంతరం ఇంటికి వెళ్లిన వీరశేఖర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కాళ్లు ఉబ్బిపోయి నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. వీరశేఖర్‌ను హింసించిన ఎస్ఐపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యపేట జిల్లా ఆత్మకూర్ పీఎస్ దగ్గర ఉద్రికత్త నెలకొంది.
ఇది కూడా చదవండి: కేంద్రం ధాన్యం కొంటదా.. కొనదా?: బీజేపీ డ్రామాలు ఆపాలన్న మంత్రి గంగుల
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily