Tuesday, November 26, 2024

రెమిడెసివర్ ఇంజక్షన్ మోసం.. ఖాళీ బాటిల్లో సెలైన్ వాటర్!

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభన గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకి అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆక్సిజన్ అందక, ఆసుపత్రుల్లో పడకలు దొరక్క ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మరోవైపు కోవిడ్ బాధితుల ప్రాణాలతో అక్రమార్కులు చెలగాటమాడుతున్నారు. శానిటైజర్ దగ్గర నుంచి రెమిడెసివర్‌ వరకు అన్నీ నకిలీవి తయారు చేస్తున్నారు. ప్రజలలో ఉండే భయాందోళను  ఆసరాగా చేసుకొని అమాయకులైన ప్రజలను  మాయ మాటలతో మోసం చేసి సొమ్మును కాజేస్తున్నారు.

కరోనా వైరస్ నుంచి తమ  వారిని రక్షించుకోవడానికి బంధువులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వారి ఆయువును నిలబెట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూన్నారు. అయితే, ఇదే అదునుగా చేసుకుని కొందరు మోసగాళ్లు క్యాష్‌ చేసుకున్నారు.  ఖాళీ రెమిడెసివర్‌ బాటిల్స్‌లో సెలైన్‌ వాటర్‌ నింపి వ్యాక్సిన్‌గా విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. . ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… నిజామాబాద్ జిల్లాకు చెందిన రంజీత్ కుమార్ అన్నకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో న‌గ‌రంలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆ ఆసుప‌త్రి వైద్యుడు ఆత‌నికి ఆరు రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు ఆవ‌సరమని వైద్యులు తెలిపారు. అయితే, ఇందుకు సంబంధించిన రెమ్‌డిసివర్ తమవ‌ద్ద లేవు మీరే తెచ్చుకోవాల‌ని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. దీంతో రంజిత్ కుమార్ ఓ ప్రైవేట్ ఆసుప‌త్రి వైద్యుడి వ‌ద్ద ఉన్నాయ‌న్న సమాచారంతో వెంట‌నే డాక్టర్ సాయికృష్ణను క‌లిశారు. అయితే, ఒక్కో ఇన్‌జ‌క్షన్ రూ.30వేల చొప్పున మూడు రెమిడెసివర్‌ కు రూ.90 వేలు చెల్లించి తీసుకువెళ్లాడు. అయితే, వాటిని ప‌రిశీలించిన వైద్యుడు న‌కీలీవ‌ని చెప్పడంతో తిరిగి వాపస్ ఇచ్చేశాడు. అయితే, తీసుకున్న డ‌బ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే సాయికృష్ణ త‌న వ‌ద్ద ఇంకా వేరేవీ కూడా ఉన్నాయని చెప్పి మ‌రో రెండు రెమిడెసివర్‌ లు ఇచ్చాడు. అవి కూడా నకిలీవి అని తేలింది. దీంతో బాధిడుతు రంజీత్ కుమార్ పోలీసుల‌ను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు విచార‌ణ చేపట్టారు. వైద్యుడు, కాంపౌండర్‌ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుంచి ఆరు రెమిడెసివర్‌ నకిలీ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement