స్మగ్లర్లు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. కొత్త దారులు వెతుక్కుంటూ మరీ అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠాను డీఆర్ఐ, హైదరాబాద్ జోనల్ యూనిట్ అదుపులోకి తీసుకుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ దగ్గర భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు ముఠాను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ కారులోని ఎయిర్‌బ్యాగ్‌లో బంగారం బిస్కెట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. విటి రూ.12 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్ కి తీసుకెళ్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఝ? హైదరాబాద్‌లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement