సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని జిన్నారం పియస్ పరిధిలో ఎయిర్‌గన్ పేలి బాలిక మృతి కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేవారు. ఫామ్ హౌస్ వాచ్ మెన్ పిల్లలు ఆడుకుంటూ సెల్ఫీలు దిగుతున్న సమయంలో వాచ్ మెన్ ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన బాలుడు (17 ) ట్రింగర్ నొక్కడంతో ఫైర్ జరిగింది. దీంతో బాలిక శాన్వీ తలలోకి పిల్లెట్ దూసుకెళ్లడంతో మృతి చెందింది. ఎయిర్ గన్ లోడ్ చేసి లాక్ చేయకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫాంహౌస్ యజమాని ప్రసాద్ ను, కాల్చిన మైనర్ బాలుడు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గన్ ను సీజ్ చేసినట్లు పటాన్ చెరు డీఎస్ పి భీంరెడ్డి వెల్లడించారు. ఫౌం హౌస్ లో ఎయిర్ గన్ వాడకూడదని హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్ హౌజ్‌లో ఎయిర్ గన్ పేలిం శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప మృతిచెందిన విషయం తెలిసిందే.