ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడు కూనూరు వద్ద కూలింది. కాగా ఈ హెలికాఫ్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు , ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించినట్టు సమాచారం. క్షతగాత్రులను వెల్లింగ్టన్ లోని ఆర్మీ హాస్పటల్ కి తరలించారు. కాగా ఈ దుర్ఘటనలో బిపిన్ రావత్ సతీమణి మృతి చెందినట్టు అనధికారికంగా తెలుస్తోంది. బిపిన్ రావత్ బతికే ఉన్నారని… అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. హెలికాఫ్టర్ లో మధులిక రావత్, బ్రిగేడియర్ లిడ్డర్, లెప్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్ , గురుసేవక్ సింగ్ ,జితేంద్రకుమార్, వివేక్ కుమార్, సాయితేజ,సత్పాల్ ఉన్నారు. ఇంత వరకు ఈ ప్రమాదానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. హెలికాప్టర్ కూలిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం అయింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రమాదానికి గురైన IAF MI17V5కి చెందిన హెలికాప్టర్ గా గుర్తించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఈ ఘటన గురించి వివరించారు కేంద్ర కేబినెట్ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ . కాగా ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్.
Advertisement
తాజా వార్తలు
Advertisement