Friday, November 22, 2024

మీరాభాయ్ చానుకి మోదీ సహాయం: రహస్యం బయటపెట్టిన మణిపూర్ సీఎం

టోక్యో ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజతం గెలిచిన మీరాబాయి చానుకి ప్రధాని నరేంద్ర మోదీ సహాయం చేశారు. ఆమెకు వైద్యం కోసం ప్రధాని నరేంద్రమోదీ సహాయం చేశారని మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తెలిపారు. ఆమెకు కండరాల ఆపరేషన్ కోసం యూఎస్ వెళ్లడానికి సహకరించారని.. అలా చేయకపోయి ఉంటే.. ఈ రోజు దేశానికి పతకం వచ్చేది కాదని బిరేన్ సింగ్ పేర్కొన్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడానికి మోదీ కృషి చేశారని చెప్పారు. మీరాభాయ్ చానుకి సహాయం చేసినందుకు దన్యావాదాలు సీఎం బిరేన్ సంగ్ తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచి భారత్‌ పతకాల ఖాతా తెరిచారు వెయిట్‌ లిఫ్ట‌ర్ మీరాబాయి చాను. వెయిట్‌ లిఫ్టింగ్‌లో 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్‌ ఎత్తి పతకం మీద ఆశలు పెంచింది. మొత్తంమీద 202 కేజీలు ఎత్తిన చాను.. స్వర్ణ పతకం కోసం జరిగిన మూడవ అటెంప్ట్‌లో విఫలమైంది. దాంతో రెండవ స్థానంలో నిలవడంతో రజత పతకం సొంత చేసుకుంది.  21 ఏళ్ల తరువాత భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్‌ మెడల్ లభించింది.

ఇది కూడా చదవండి: Tokyo Olympics: గోల్డ్ రేసులో గోల్ఫ‌ర్ అదితి అశోక్..

Advertisement

తాజా వార్తలు

Advertisement