ప్రధాని మోడీ బహిరంగ సభ తర్వాత త్రిపురలోకరోనా వైరస్ విపరీతంగా వ్యాపించిందని సీపీఐఎం త్రిపుర కార్యదర్శి జితేంద్ర చౌదరి అన్నారు. త్రిపురలో నిన్ని ఒక్కరోజే తక్కువలో తక్కువ 1,070 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ముగ్గురు వ్యక్తులు చనిపోయినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారని అన్నారు. కాగా, ఈ నెల ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అగర్తలాలో చేపట్టిన మెగా ర్యాలీతోనే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు కమ్యూనిస్టు నేతలు. —
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా -మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ నేతలు ఇలా అన్నారు, “కోవిడ్ -19 యొక్క కొత్త రూపాంతరం ఒమిక్రాన్ గురించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు, ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి బహిరంగ ప్రదర్శన, ర్యాలీ చేపట్టడం మరింత విషమంగా మారింది. అయితే త్రిపురలోని మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం యొక్క కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన తర్వాత (జనవరి 4న) అగర్తలాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆయనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ప్రధాని మోడీ తన ర్యాలీలతో “వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.. త్రిపురను కొవిడ్ తయారీ కేంద్రంగా మారుస్తున్నారు” అని కార్యక్రమం ముగిసిన వెంటనే, తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆరోపించింది.