యూపీలో విజయం సాధించిన తర్వాత గుజరాత్ పర్యటనలో ఉన్నారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా తన తల్లి హీరాబెన్‌ను కలిశారు. రెండేళ్ల తర్వాత మోడీ తన తల్లిని కలిశారు..కాగా ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయని..మోడీ ఇంతకుముందు 2019లో తన తల్లిని కలిశారు. ప్రధాని మొదట తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారని, ఆ తర్వాత కలిసి భోజనం చేశారు.ఈ ఫొటోలపై నెటిజన్లు తమ స్పందనని తెలియజేశారు.. ఎంత ఎదిగినా కొడుకు కొడుకే అన్నారు.. “మోదీ కీ జై-జై ..”తల్లి-కొడుకుల ప్రేమను చూసి, ఏడుపు వచ్చిందన్నారు.అనంతరం ఆయన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ షోకు భారీగా జనం తరలివచ్చారు. ఆ తర్వాత పంచాయత్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని ప్రసంగించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ బాపు, సర్దార్ పటేల్‌ల భూమి అని అన్నారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల సమాన అభివృద్ధి అవసరం. ఈ ప్రసంగం కాకుండా, ప్రధానమంత్రి బిజెపి కార్యాలయంలో కార్యకర్తలందరితో కూడా సంభాషించారు. ప్రస్తుతం కరోనా బీభత్సం తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కార్యకర్తలు మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..