Friday, November 22, 2024

ఒమిక్రాన్ పై ప్రధాని మోదీ కీలక సమావేశం

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశంలో 236 కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో దేశంలో కరోనా కేసులు పెరుగుదల, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై చర్చించనున్నారు.

కరోనా, ఒమిక్రాన్ విషయంలో ఎలా వ్యవహరించాలనేది అధికారులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. భారత దేశంలోని 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పటివరకు 236 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 104 మంది బాధితులు కోలుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement