ప్రధాని మోదీ ప్రారంభించనున్న తొమ్మిది వందే భారత్ రైళ్ల వివరాలు ఇవే..
1. ఉదయపూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
2. తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్
3. హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్
4. విజయవాడ-చెన్నై (రేణిగుంట మీదుగా) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
5. పాట్నా-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్
6. కాసరగోడ్-తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్
7. రూర్కెలా- భువనేశ్వర్-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
8. రాంచీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్
9. జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఈ తొమ్మిది రైళ్లు రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్‌తో సహా 11 రాష్ట్రాలలో నడుస్తాయి. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన టెంపుల్స్‌ని, ఆయా ముఖ్య పట్టణాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. రెండు వందే భారత్ మార్గాలు — రూర్కెలా-భువనేశ్వర్-పూరి, తిరునెల్వేలి-మధురై-చెన్నై వరుసగా పూరీ.. మదురై వంటి అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఆలయాలను, అక్కడి పట్టణాలకు కనెక్ట్ చేస్తాయి. విజయవాడ-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రేణిగుంట మార్గం ద్వారా నడుస్తుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి కనెక్టివిటీని అందిస్తుంది.
వందే భారత్ రైలు ప్రత్యేకతలు ఇవే..
వందే భారత్ రైళ్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి, కవాచ్ టెక్నాలజీ ఉంది. లోకో పైలట్ విఫలమైతే కవచ్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ బ్రేక్‌లను ఉపయోగించి రైలు వేగాన్ని తనకు తానే నియంత్రించుకుంటుంది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. వందే భారత్ రైళ్లు వాటి మార్గాల్లో అత్యంత వేగంగా ఉంటాయి.
“ఈ వందే భారత్ రైళ్లు తమ ఆపరేషన్ మార్గాల్లో అత్యంత వేగవంతమైన రైళ్లుగా ఉంటాయి. ప్రయాణికుల సమయాన్ని గణనీయంగా ఆదా చేయడంలో సహాయపడతాయి. రూర్కెలా-భువనేశ్వర్-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ .. కాసరగోడ్-తిరువనంతపురం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలుతో పోలిస్తే మూడు గంటలపాటు వేగంగా ఉంటాయి
ఇక.. హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండున్నర గంటలకు పైగా సమయం ఆదా అవుతుంది. తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలకు పైగా, రాంచీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, పాట్నా-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు గంట సమయం; ఉదయ్‌పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి అరగంట సమయం ఆదా అవుతుందని ప్రభుత్వం తెలిపింది.