దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరగబోతోంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించనున్నారు. దీంతో పాటు దక్షిణాఫ్రికాతోపాటు పలు దేశాల్లో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రధానంగా చర్చించనున్నారు. ఈ వేరియంట్ పై ఇప్పటికే వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మోదీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో కొత్త వేరియంట్ కేసులు నమోదు కాలేదు. అయితే, ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..