Sunday, November 17, 2024

ప్రత్యేక వేషధారణలో ప్రధాని మోడీ.. డ్రెస్​ డిజైన్​పై ప్రత్యేక చర్చ..

అమరవీరులకు నివాళులర్పించేందుకు ఇవ్వాల (బుధవారం) జాతీయ యుద్ధ స్మారకం దగ్గరికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త సంప్రదాయ డ్రెస్​లో కనిపించారు. ఉత్తరాఖండ్ సంప్రదాయ టోపీని, ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం అయిన బ్రహ్మకమలాన్ని కూడా ధరించారు. కేదార్‌నాథ్‌లో పూజలు చేసినప్పుడల్లా ప్రధాని ఈ పువ్వును ఉపయోగిస్తారు. అంతేకాకుండా మణిపూర్ కు చెందిన స్టోల్ ధరించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రధాని మోడీ ధరించిన  డ్రెస్​లోని వస్తువులన్నీ వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో ముడిపడి ఉన్నాయి.

జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన ప్రధానమంత్రి అనంతరం రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతున్న రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. జనవరి 21న నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర్ జవాన్ జ్యోతిని ఎటర్నల్ ఫ్లేమ్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement