Friday, November 22, 2024

Breaking: కాశీ ఆలయంలో పనిచేసేవారికి జూట్ పాదరక్షలు.. 100 జతలు పంపించిన మోడీ..

కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో పనిచేస్తున్న వారికి ప్రధాని నరేంద్ర మోడీ జూట్ తో చేసిన పాద రక్షలు(చెప్పులు) సోమవారం పంపించారు. ఆలయ ప్రాంగణంలో లెదర్, రబ్బరు చెప్పులను ధరించడం నిషేధించారు. దీంతో కాశీ విశ్వనాథ్ ధామ్‌లో పనిచేసే వారిలో ఎక్కువ మంది చెప్పులు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని తెలుసుకున్న ప్రధాని వారి కోసం 100 జతల జ్యూట్ పాదరక్షలను పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి..

అయితే ఇలా చెప్పులు లేకుండా ఉత్త కాళ్లపై నడుస్తూ పనిచేసే వారిలో పూజారులు, సేవ చేసే వ్యక్తులు, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వీరంతా ప్రస్తుత చలికాలంలో గజగజ వణికించే శీతల గాలలు మధ్య రాళ్లపై నడుస్తూ పనిచేయడం చాలా కష్టమవుతోంది. దీన్ని గమనించిన మోడీ వారికి పాదరక్షలు పంపించినట్టు అధికారులు తెలిపారు. కాగా, వారణాసిలోని అన్ని సమస్యల పట్ల ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు. ఈ మధ్యనే కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణాన్ని భారీగా విస్తరించారు. ఆ సముదాయాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ధామ్ మొదటి దశను గత నెలలో ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement